గుర్రంకొండ సంతంటే దడ..!
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:09 PM
గుర్రంకొండ సంతలో కూరగాయలు, నిత్యావసరాలు, పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్లిన ప్రజలకు పెద్ద కష్టం వచ్చిపడుతోంది.
మాయమవుతున్న ఖరీదైన ఫోన్లు వందదాకా ఫోన్లు చోరీ హడలిపోతున్న ప్రజలు, వ్యాపారులు
గుర్రంకొండ, జూలై 18: గుర్రంకొండ సంతలో కూరగాయలు, నిత్యావసరాలు, పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్లిన ప్రజలకు పెద్ద కష్టం వచ్చిపడుతోంది. సంతలో వందలాది రూపాయల కూరగాయలు కొంటే వేలాది రూపాయల విలువ చేసే సెల్‌ఫోనలు పోగొట్టుకుంటున్నారు. ప్రతి శుక్రవారం సంతలో ఐదు నుంచి 10 సెల్‌ఫోనలను కేటుగాళ్లు చాకచక్యంగా కొట్టేస్తున్నారు. సంతలో చోరీలు జరగకుండా ప్రతి వారం పోలీసులు గస్తీ ఉన్నా చోరీలు మాత్రం ఆగడం లేదు. సెల్‌ఫోన్లు చోరీ చేసే దొంగలను ప్రజలు పట్టించినా వదిలేస్తున్నారని బహిరంగంగా చర్చించుకొంటున్నా రు. దీంతో ప్రజలు, వ్యాపారులు, మహిళలు సంతలో అడుగుపెట్టాలంటే హడలిపోతున్నారు. గుర్రంకొండ పట్టణంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ సంతకు పెద్దమండెం, గాలివీడు, కలకడ, తరిగొండ, వాల్మీకిపురం, చిన్నమండెం, ముదివేడు, అంగళ్లు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు, ప్రజలు కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను తీసుకొస్తారు. దీంతో సంత ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సా యంత్రం 6.30 గంటల వరకు జరుగుతుంది. ఈ క్రమంలో కేటుగాళ్లు సంతలో తిరుగుతూ విలువైన సెల్‌ఫోన్లు కలిగిన వ్యక్తులను గమనించి జనాలు రద్దీగా ఉండే సమయంలో సెల్‌ఫోన్లను కొట్టేస్తున్నారు. ముఖ్యం గా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో అధిక సంఖ్య లో కేటుగాళ్లు సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతలో చోరీ లు జరగకుండా గస్తీగా పనిచేసే సిబ్బంది ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయంలో సంత ప్రాంతంలో తిరగడం లేదని ప్రజలు, వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లా అధికారులు సెల్‌ఫోనల చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆరు నెలల్లో వందకుపైగా...
గుర్రంకొండ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే సంతలో సుమారు వందకుపైగా సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. ఈ ఆరు నెలల కాలంలో నెలకు 20 చొప్పున సెల్‌ఫోన్లు పోయాయి. సంతలో చోరీకి గురైన సెల్‌ఫోన్ల విలువ రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంతలో సెల్‌ఫోన దొంగలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా పట్టించుకొనే వారు లేకపోవడం ప్రజలను ఆందోళనకు చెందుతున్నారు.
మైనర్ నిందితుడు ఎక్కడ...?
గుర్రంకొండ సంతలో సెల్‌ఫోన్లను చోరీ చేసే మైనర్ నిందితుడిని రెం డు వారాల క్రితం స్థానికులు పోలీసులకు పట్టించారు. నిందితుడు మైన ర్ కావడంతో ఒకరోజు పోలీస్ స్టేషనలో ఉంచుకుని పంపేశారు. విష యం తెలుసుకున్న స్థానికులు మైనర్‌ల నుంచి వివరాలను సేకరించారా లేదా అన్న సమాచారాన్ని పోలీసులను అడిగారు. దీంతో మైనర్‌ను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ బాలల కేంద్రంలో అనధికారంగా ఉంచినట్లు తెలుస్తోంది. బాల నిందితుడు అక్కడే ఉన్నాడా లేదా...? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
సెల్‌ఫోన దొంగలపై నిఘా ఉంచాం
గుర్రంకొండ సంతలో సెల్‌ఫోనలను చోరీ చేసే ముఠా సభ్యులపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇందుకోసం ప్రతి శుక్రవారం సంత రోజు ఇద్దరు పోలీసులను ఉంచి చోరీలు జరగకుండా నియంత్రిస్తున్నాం. స్థానికులు పట్టించిన మైనర్‌ను మరోమారు విచారించి చోరీలను ఆరికడతాం.
- నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ, గుర్రంకొండ