ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:19 PM
విద్యార్థులు సం స్కృతి, సంప్రదాయాలు పాటించి భవిష్యత్తు తరా లకు ఆదర్శంగా నిలవాలని గౌతమి మహిళా ఇంజనీ రింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామసుబ్బమ్మ తెలిపారు.

ప్రొద్దుటూరు టౌన్, జన వరి 12: విద్యార్థులు సం స్కృతి, సంప్రదాయాలు పాటించి భవిష్యత్తు తరా లకు ఆదర్శంగా నిలవాలని గౌతమి మహిళా ఇంజనీ రింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామసుబ్బమ్మ తెలిపారు. శుక్రవారం కళా శాలలో సంక్రాంతి సంబ రాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు మెహందీ, రంగోళి, గాలిపటాల పోటీ లు, ఉట్టికొట్టడం, బోగిమంటలు వేశారు. దేశీయ రుచులతో ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. కరస్పాండెంట్ బాబమ్మ, డైరెక్టర్లు నాగూర్, రవీంద్రారెడ్డి, కోడైరెక్టర్ శైలూషా, డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాశ్ రావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
మైదుకూరు, జనవరి 12: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అలరిం చాయి. ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి ఆధ్వ ర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదా య వేషధారణతో వేడుకల్లో పాల్గొన్నారు. బోగి మంటలు, ముగ్గులు, గంగిరెద్దులతో ముందస్తు వేడుకను నిర్వహించారు.
నేడు సీబీఐటీలో సంక్రాంతి సంబరాలు
చాపాడు, జనవరి 12: సీబీఐటీ కాలేజీలో 13న శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు కాలేజీ చైర్మన్ జయచంద్రారెడ్డి తెలిపారు. ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేయడం, పలు రకాల స్టాల్స్ నిర్వహించడం, కోలాటం, బొంగరాలు తిప్పడం, గోలీలాట, బోగిమంటలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.