Share News

పాలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:22 PM

పాలపై లీటరుకు రూ.4లు అదనపు ధర చెల్లిస్తామని ఐదేళ్ళ క్రితం వైసీపీ ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైం దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌ రెడ్డి సతీమణి నల్లారి తనూజమ్మ విమర్శించారు.

పాలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
తుమ్మలపేటలో మహిళా పాడి రైతులతో తనూజా రెడ్డి

కలికిరి, మార్చి 18: పాలపై లీటరుకు రూ.4లు అదనపు ధర చెల్లిస్తామని ఐదేళ్ళ క్రితం వైసీపీ ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైం దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌ రెడ్డి సతీమణి నల్లారి తనూజమ్మ విమర్శించారు. కలికిరి పంచా యతీలోని పలు గ్రామాల్లో ఆమె సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో పలు అంశాలపై చర్చించారు ఆవులను పోషిస్తూ, పాలు అమ్ముకోవడంతోనే కుటుంబాలను పోషిస్తున్నట్లు మహిళలు చెప్పడంతో టీడీపీ అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు తనూజా రెడ్డి చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు వంతున ప్రభుత్వం అందజేస్తుందని ఆమె వివరించారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి సైకిల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలను పంచిపెట్టారు. పంచాయతీలోని కొత్తపల్లె, తుమ్మలపేట, వడ్డెపల్లె, జడావాండ్లపల్లె, చింతమాకులపల్లెల్లో తనూజా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కలికిరి మేజరు పంచాయతీ సర్పంచు ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీటీసీ గాయత్రి, మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, టీడీపీ యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జీలు, సాధికార కమిటీలు, అనుబంధ విభాగాల నాయకులు, వివిధ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:22 PM