Share News

వైభవంగా అగస్త్యేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - May 23 , 2024 | 11:23 PM

అగస్త్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభజంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.

వైభవంగా అగస్త్యేశ్వరస్వామి రథోత్సవం
పురవీధుల్లో రథోత్సవం

ప్రొద్దుటూరు టౌన్‌, మే 23: అగస్త్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభజంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. పూజలు అనంతరం గంగా, రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామిని సుందరంగా అలంకరించి రథంపై ఆశీనులను చేశారు. భక్తుల శివనామస్మరణలతో, పురవీధుల్లో రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దారి పొడవునా భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు.

చెక్కభజన, మహిళల కోలాటం, మంగళవాయిద్యాలతో స్వామివారి రథోత ్సవం ఘనంగా సాగింది. ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం, వెదుర్లబజార్‌, గౌరమ్మకట్టవీధి, కొవ్వూరు గ్యారేజీ, అమ్మవారిశాల వరకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత మెయిన్‌బజార్‌, పప్పులబజార్‌, లైట్‌పాళెం మీదుగా శివాలయానికి చేరుకుంది. రథం లాగడానికి భక్తులు పోటీపడ్డారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:23 PM