Share News

కనుమలో గంగమ్మ...చల్లంగా చూడమ్మా

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:05 PM

చల్లంగా చూడమ్మా..గంగమ్మ అంటూ కనుమలో గంగమ్మకు భక్తు లు దీలూ, బోనాలూ సమర్పించి కర్ఫూర హారతులతో వేడుకున్నారు.

కనుమలో గంగమ్మ...చల్లంగా చూడమ్మా
దీలూ, బోనాలూ తీసుకువెళుతున్న మహిళలు

మదనపల్లె, జూన 2: చల్లంగా చూడమ్మా..గంగమ్మ అంటూ కనుమలో గంగమ్మకు భక్తు లు దీలూ, బోనాలూ సమర్పించి కర్ఫూర హారతులతో వేడుకున్నారు. ఆదివారం మున్సి పల్‌ వైస్‌ చైర్మన జింకవెంకటాచలపతి ఆధ్వర్యంలో పట్ణణంలోని ఎన్వీఆర్‌ లేఅవుట్‌, వడ్డిపల్లెకు చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్లి పుంగనూరు రోడ్డులో వెలసిన కనుమలో గంగమ్మకు దీలూ, బోనాలూ సమర్పించారు. వర్షాలూ బాగా కురిసి పంటలు బాగా పండాలని, పట్టణంలో నీటి సమస్య లేకుండా చూడాలని మొక్కుకున్నా రు. ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీ వించాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని కాయకర్ఫురాలు సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, చిన్న ఆం జినేయులు, సూరి, హేమంత, పెద్ద ఆంజినేయులు, అరుణమ్మ, రెడ్డమ్మ, దీప, హేమ, రాధమ్మ, విజయమ్మ వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:05 PM