Share News

ఫైనల్స్‌ చేరిన గాంధీనగర్‌,ముద్దుకృష్ణ జట్లు

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:42 PM

నందలూరు ప్రీమియర్‌ లీగ్‌ 8వ సీజనలో భాగంగా నందలూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఓపెన టు ఆల్‌ హార్డ్‌ టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంటులో అరవపల్లె గాంధీనగర్‌ జట్టు, మంటపంపల్లె ముదు కృష్ణ జట్లు ఫైనల్స్‌కు చేరాయి.

ఫైనల్స్‌ చేరిన గాంధీనగర్‌,ముద్దుకృష్ణ జట్లు
మ్యాన ఆఫ్‌ ది మ్యాచను అందుకున్న ఎండీ ముక్రం

నందలూరు, జూన 2: నందలూరు ప్రీమియర్‌ లీగ్‌ 8వ సీజనలో భాగంగా నందలూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఓపెన టు ఆల్‌ హార్డ్‌ టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంటులో అరవపల్లె గాంధీనగర్‌ జట్టు, మంటపంపల్లె ముదు కృష్ణ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం ఉదయం జరిగిన మ్యాచలో రైజింగ్‌ స్టార్‌ జట్టుపై గాంధీనగర్‌ లెవెన్స జట్టు విజయం సాధించి గాంధీన గర్‌ లెవెన్స ఫైనల్లోకి ప్రవేశించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గాంధీనగర్‌ జట్టు 14 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 92 పరుగులు చేసింది. జయకుమార్‌ 24 పరుగులు చేశాడు. అనంతరం విజయం కోసం బరిలో దిగిన రైజింగ్‌ స్టార్‌ జట్టు 14 ఓవర్లలో 90 పరుగులకు 5 వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది. రైజింగ్‌ స్టార్‌ జట్టు బౌలర్‌ చంద్ర 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి మ్యానఆప్‌ది మ్యాచను సొంతం చేసుకున్నాడు.

కింగ్స్‌ డాబాపై ముద్దుకృష్ణ జట్టు విజయం

ఆదివారం మధ్యాహ్నం జరిగిన రెండవ సెమీఫైనల్‌ మ్యాచలో మంటపంపల్లె కింగ్స్‌ డాబా జట్టుపై మంటపంపల్లె ముద్దుకృష్ణ జట్టు విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ డాబా జట్టు 9 వికెట్లను కోల్పోయి 110 పరుగులు చేసింది. తిప్పేస్వామి 48 పరుగులు చేశాడు. ఎండి ముక్రం నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అనంతరం 110 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ముద్దుకృష్ణ జట్టు 9 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 114 పరుగులు చేసి విజయం సాధించింది. అహమ్మద్‌ ఆస్కరి 41, వాలి 21, ఎం.సాచి 28 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచకు క్రీడా కారులు చందు, రాము ఆంపైర్లుగా, అప్సర్‌, దినేష్‌లు స్కోరర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు పల్లె గ్రీష్మంతరెడ్డి, ముమ్మడిశెట్టి సుధాకర్‌, రంజిత, క్రీడా కారులు , క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 09:42 PM