Share News

విద్యా క్యాలెండర్‌ ప్రకారమే ఆటల పోటీలు

ABN , Publish Date - May 25 , 2024 | 10:24 PM

ద్యా సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామని టార్గెట్‌ బాల్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షురాలు కే. సంధ్య తెలిపారు.

విద్యా క్యాలెండర్‌ ప్రకారమే ఆటల పోటీలు
సమావేశానికి హాజరైన అసోసియేషన సభ్యులు

టార్గెట్‌ బాల్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షురాలు కే. సంధ్య

రాయచోటిటౌన, మే 25: విద్యా సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామని టార్గెట్‌ బాల్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షురాలు కే. సంధ్య తెలిపారు. శనివారం పట్టణంలోని పీసీ ఆర్‌ గ్రాండ్‌ హోటల్‌లో టార్గెట్‌ బాల్‌ అసోసియేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోవు విద్యా సంవత్స రంలో సీనియర్స్‌ విభాగం టోర్నీ కృష్ణాజిల్లాలో, జూనియర్‌ విభాగం టోర్నీ అనంతపూర్‌ జిల్లాలో, సబ్‌ జూనియర్‌ పోటీలు నెల్లూరు జిల్లాల్లో నిర్వ హించాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లా పీఈటీ అసోసియేషన ప్రెసిడెంట్‌ వీరాంజనేయులు, రెడ్డెయ్య పాల్గొన్నారు. అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్‌, సభ్యులు రేవంత అబ్జర్వర్స్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టార్గెట్‌ బాల్‌ అసోసి యేషన వివిధ జిల్లాల కార్యదర్శులు, అధ్యక్షులు, వైస్‌ ప్రెసిడెంట్‌ శివ, , సతీశ, గణేశ, పూర్ణాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 10:24 PM