Share News

నలభై ఏళ్ల పాలనను మరిపిస్తా

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:19 PM

ఒక్కసారి అవకా శం ఇస్తే నలభై ఏళ్ల పాలనను మరిపిస్తానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అన్నారు. గురువారం బీటెక్‌ రవి ఆయన సతీమణి లతారెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు.

నలభై ఏళ్ల పాలనను మరిపిస్తా
కడపలో టీడీపీ పొలిట్‌ బ్యారో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జి మాధవీరెడ్డి, జనసేన నేత సుంకర శ్రీనివాస్‌

ఒక్క అవకాశం ఇవ్వమనికోరిన బీటెక్‌ రవి

రాష్ట్రంలో పేట్రేగుతున్న అరాచక పాలన

బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జ్‌ మాధవీరెడ్డి,

జనసేన జిల్లా కన్వీనరు సుంకర శ్రీనివాస్‌

పులివెందుల టౌన్‌, జనవరి 11: ఒక్కసారి అవకా శం ఇస్తే నలభై ఏళ్ల పాలనను మరిపిస్తానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అన్నారు. గురువారం బీటెక్‌ రవి ఆయన సతీమణి లతారెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. జగన్‌ మోహన్‌రెడ్డి రాక్షసపాలన చేస్తున్నారని దానికి చరమ గీతం పాడి మంచిపాలనను తెచ్చుకుందాం టీడీపీకి ఓటు వేయండి అంటూ ప్రజలను అడిగారు. వైఎస్‌ జగన్‌ ఒక్కచాన్స్‌ అని చెప్పి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు జోగిరెడ్డి, వెంకట రామిరెడ్డి, సిద్దారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, మైసూరారెడ్డి, ఆకుల ప్రసాద్‌, మహబూబ్‌ బాష, ఖాసీం వల్లి, విజయ్‌కుమార్‌రెడ్డి, బాబు, యేమిరెడ్డి, గంగాధర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, అనసూయ, బీబీ, అరుణ, దేవి, కుమారి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన

కడప (ఎడ్యుకేషన్‌), జనవరి 11: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఇన్‌చార్జ్‌ మాధవీరెడ్డి, జనసేన కడప జిల్లా కోఆర్డినేటర్‌ సుంకర శ్రీనివాస్‌ అన్నారు. గురువారం కడప నగరం ఐదో డివిజన్‌ అశోక్‌నగర్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారం టీలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందిం చారు. జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో అరాచ కం ఎక్కువైందని, వైసీపీ నేతలు భూ ఆక్రమణలు, పాటు ఇసుక మాఫియా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీనిని కట్డడిచేయాలంటే టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభు త్వం రావాలసిన అవసరం ఉందన్నారు.

కార్యకర ్తలకు అండగా ఉంటాం

టీడీపీ, జనసేన కార్యకర్తలకు అండగా నిలు స్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివా సరెడ్డి, జనసేన జిల్లా కోఆర్డినేటరు సుంకర శ్రీని వాస్‌ తెలిపారు. గురువారం చలమారెడ్డిపల్లె టీడీపీ కార్యకర్త హనుమంతు ఇంటికి వెళ్లి పరామర్శించిన వారు మాట్లాడుతూ నగరంలో వైసీపీ అండదండల తో అరాచకాలు మితిమీరుతున్నాయన్నారు. కార్య కర్తలు భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

చెన్నూరు, కొండపేట, కనుపర్తి గ్రామాల్లో....

చెన్నూరు, జనవరి 11: రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోసం టీడీపీని గెలిపించుకుందామని చంద్రబాబు సీఎం అయితేనే అందరం బాగుంటామని మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి, కొండపేట, కనుపర్తి సీనియర్‌ నేతలు, మాజీ సర్పంచ్‌లు ఎం.మోహన్‌ రెడ్డి, ఆర్‌.సుధాకర్‌రెడ్డి, లేవాకు విజయ ప్రతాప్‌రెడ్డి, ఓ.విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మండల కన్వీనరు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుం బాలకు బాగుపడతామన్న కల వైసీపీ పాలనలో లేకుండా పోయిందన్నారు. అన్ని రకాల వర్గాలు ఉద్యోగులు సైతం టీడీపీ కావాలని బలంగా కోరు కుంటున్నారని ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ మునిగిపోయే నావ వంటిదని, ఆ పార్టీ నేతలే అక్కడ ఉండలేక ఆ నేతల టార్చర్‌ భరించలేక వారు పనులు చేసినా బిల్లులు రాక వెనుదిరిగారని ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్నారు.

చివరికి గ్రామ పంచాయతీల్లో చిన్నపాటి పనులు చేసినా సర్పంచ్‌ లు నిధులు లేక అలంకార ప్రాయంగా కుర్చీలకే పరిమితమై ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల్లోకి వెళితే ఏం జవాబు చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమయ్యారన్ని అప్పు చేసి పెట్టిన ఖర్చు కూడా రాని పరిస్థితన్నారు. చంద్రబా బును గెలిపించి టీడీపీతో సంక్షేమ అభివృద్ది అందు కోవాలన్నారు. అనంతరం సూపర్‌సిక్స్‌తో ఎలాంటి ప్రయోజనాలో ఇంటింటికీ వివరించారు. కార్యక్రమం లో టీడీపీ నేతలు బిట్టి ఆది, యువనేత సంజీవ్‌ పవన్‌, మాజీ సర్పంచ్‌లు బాషు, సాదక్‌, ఉప సర్పంచులు ఖాసింపీరా, మాబు, మైనార్టీ నేత షబ్బీర్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:20 PM