Share News

డెంగ్యూ నివారణపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:03 PM

జిల్లాలో డెంగ్యూ నివారణపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా వైద్యా ధికారి డాక్టర్‌ కొండయ్య, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ వైద్య సిబ్బందికి సూచించారు..

డెంగ్యూ నివారణపై దృష్టి సారించాలి
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగాంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కొండయ్య

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కొండయ్య

సంబేపల్లె, జూలై 5: జిల్లాలో డెంగ్యూ నివారణపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా వైద్యా ధికారి డాక్టర్‌ కొండయ్య, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ వైద్య సిబ్బందికి సూచించారు.. శుక్రవారం మండలంలోని నారాయణరెడ్డిపల్లె సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. అనంతరం ముదినేనివడ్డెపల్లెలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలన్నారు. డ్రమ్ములో, తొట్లలో లార్వాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలన్నారు. జ్వరం, ఒళ్లు నొప్పు లు వస్తే వెంటనే ఉప కేంద్రంలో గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బందితో కానీ డాక్టర్లను సంప్రదించాలన్నారు. వర్షాకాలం కావడంతో దోమలు విపరీతంగా పెరిగాయని, వాటి నుంచి రక్షించు కోవ డానికి దోమతెరలు వాడాలన్నారు. వేపాకు పొగ వేసి దోమలబారి నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరి యా సబ్‌యూనిట్‌ అధికారి ప్రసాద్‌, జయరామయ్య, హెల్త్‌ అసిస్టెంట్‌ రవిశంకర్‌, ఏఎనఎం భాగ్యలక్ష్మి, 104 డీఈవో బాలకృష్ణంరాజు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:04 PM