Share News

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : రూ.40వేలు ఆస్తినష్టం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:18 PM

షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో జీబీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న లూర్దుమేరీ నివాసగృహం అగ్నికి ఆహుతి కావడంతో రూ.40వేలు ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక కేంద్రం అధికారి నజీర్‌ అహ్మద్‌ తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : రూ.40వేలు ఆస్తినష్టం

పోరుమామిళ్ల, మార్చి 4 : షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో జీబీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న లూర్దుమేరీ నివాసగృహం అగ్నికి ఆహుతి కావడంతో రూ.40వేలు ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక కేంద్రం అధికారి నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. ఆదివారం రాత్రి రంగసముద్రం పంచాయతీ పరిధిలోని జీబీనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె నివాసం ఉంటున్న గృహంలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయని విషయం తెలిసిన వెంటనే తమ సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశామన్నారు. సోమవారం రెవెన్యూ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

Updated Date - Mar 04 , 2024 | 11:19 PM