సర్వజన బోఽధనాస్పత్రిలో ఎస్వీ వైద్యబృందం పరిశీలన
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:24 PM
మదనపల్లె మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న సర్వజన బోధనాస్పత్రి(జీటీహెచ)లో ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు పర్యటించారు.

మదనపల్లె టౌన, జూన 7:మదనపల్లె మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న సర్వజన బోధనాస్పత్రి(జీటీహెచ)లో ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు పర్యటించారు. శుక్రవారం ఎస్వీ మెడి కల్ కాలేజీ ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ రమాదేవిలు జీటీహెచలో పలు చోట్ల పరిశీలించి ఆస్పత్రి వైద్యులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మెడికల్‌సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ త్వరలో మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిని, ఆరోగ్యవరం వద్ద మదనపల్లె మెడికల్ కాలేజీని నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు పరిశీలిం చనున్నారన్నారు. దీనికి ముందుగానే బోధనాస్పత్రిలో ఏయే సదుపాయాలు, వైద్య పరీక్ష పరికరాలు, చికిత్సలు ఉండాలో ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటున్నామ న్నారు. వచ్చే నెలలో ఎనఎంసీ సభ్యులు మదనపల్లెకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్ బాబు, మురళీధర్‌లు పాల్గొన్నారు.