Share News

అహంకార ధోరణికి నిదర్శనం

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:22 PM

మూడు మద్యం సీసాలకు మించితే పట్టుకోవచ్చని అధికారం ఇచ్చి ప్రజాప్రతినిధులు వద్దని దౌర్జన్యం చేస్తే ఎలాగని, ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రా చమల్లు ప్రసాద్‌ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శన మని మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, కడప పార్లమెంట్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు లింగా రెడ్డి విమర్శించారు.

అహంకార ధోరణికి నిదర్శనం

పోలీసు అధికారుల సంఘం ఎందుకు స్పందించదు

ఎస్‌ఐపైనే దౌర్జన్యం చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి

రాచమల్లు వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యేలు వరద, లింగారెడ్డి

ప్రొద్దుటూరు , జనవరి 12: మూడు మద్యం సీసాలకు మించితే పట్టుకోవచ్చని అధికారం ఇచ్చి ప్రజాప్రతినిధులు వద్దని దౌర్జన్యం చేస్తే ఎలాగని, ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రా చమల్లు ప్రసాద్‌ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శన మని మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, కడప పార్లమెంట్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు లింగా రెడ్డి విమర్శించారు. గురువారం ఎస్‌ఈబీ స్టేషనుకెళ్లి దౌర్జన్యంగా నిందితుడిని బయటకు తీసుకెళుతూ ఎస్పీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. వరద రాజులరెడ్డి మాట్లాడుతూ మూడు మద్యం సీసాల కంటే అదనంగా తీసుకెళితే పట్టుకోమని అధికార మిచ్చి ఎస్‌ఈబీ అధికారులను ఎమ్మెల్యే పట్టుకోవ ద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీలో వుండి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రికి చెప్పి చట్టంలో సవరణ చేయించమని సలహా ఇచ్చారు. ప్రైవేటు బార్ల ఆదాయనికి దెబ్బపడు తుందని వాటికి దగ్గరలో వున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తరలించిన సందర్భంలో రాచమల్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

ప్రభుత్వంలో వుండి చట్టాన్ని తూట్లు పొడిచేలా మాట్లాడేది రాచమల్లు కే చెల్లన్నారు. కంబట్లో అన్నంతింటూ అన్నంలో ఎంటికలున్నాయనే రకం రాచమల్లుదని ఎద్దేవా చేశారు. నీతిమంతుడైతే మాట్లాడాలి గానీ తానే అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతూ నీతి వ్యాఖ్యలు చేయడం దాన్ని ప్రజలకోసం మని మాట్లాడటం సిగ్గుచేట న్నారు. మీ తోటల్లో ఇళ్లు కట్టించి ఏసీలు పెట్టించి జూదం ఆడించి మేజులు తీసుకుంటున్నావని ఆరోపిం చారు. మీ ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయల అక్రమార్జన గడిస్తు న్నావని ఆరోపించా రు. తహీల్దారు సబ్‌రిజిస్ట్రార్‌ పోలీసులు అవినీతి ఉద్యోగులు కాదా ఎస్‌ఈబీ వాళ్లే అవినీతి ఉద్యోగులన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్‌ వద్దిబాలుడు టీడీపీ నేతలు గోపవరం లక్ష్మణ్‌, కట్టమీది మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే లింగారెడ్డి ఫైర్‌

ఎస్‌ఈబీ ఎస్‌ఐ పైనే దౌర్జన్యానికి దిగితే సామాన్యు ల పరిస్ధితి ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎస్పీపై అనుచిత వ్యాఖ్య లు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇంతకాలం నీ బెదిరింపులకు దాడులకు భయపడి అధికారులు పనులు చేశారు. ఎన్నికలు దగ్గర పడ్డా కూడా ఇంకా మీకు అనుకూలంగా చేయాలని ఎస్పీ నే బూతులు తిట్టే స్థాయికి వచ్చావంటే నీ స్థాయి ఏమిటో తెలుస్తుందన్నారు. పోలీసులపై బెదిరింపు లు దాడులు జరుగుతుంటే పోలీసు అధికారుల సం ఘం ఎందుకు ప్రశ్నించదన్నారు. కేవలం టీడీపీ నేతలు పోలీసులపై ఫిర్యాదు చేయగానే ప్రెస్‌మీట్‌ లు పెట్టే అధికారులు ఎమ్మెల్యే దౌర్జన్యంపై స్పం దించలేదెందుకని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం పత నం అవుతున్నా ఇంకా మీ దౌర్జన్యాలు ఆగలేద న్నా రు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆయన కోరారు.

ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి : ప్రవీణ్‌ రెడ్డి

ప్రొద్దుటూరు టౌన్‌, జనవరి 12: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంపై దౌర్జన్యం చేసి నిం దితుడిని విడిపించుకుపోయిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డిపై పోలీసు అధికారులు చర్యలు తీసు కోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాల యంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ మూడు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉంటే కేసు నమోదు చేయాలని ప్రభుత్వం చట్టం చేసింద ని, దీనిపై ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో నిలదీయాలన్నారు. చట్టాన్ని దిక్కరిస్తూ ఎమ్మెల్యే సెబ్‌ కార్యాలయంపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు.

ఎమ్మెల్యేకు నాలుగున్నరేళ్ల తర్వాత చట్టంలోని లోపాలు గుర్తుకొచ్చాయ ని ఎద్దేవా చేశారు. ఎస్పీ అమ్మ మొగుడికి చెప్పుకో అని ఒక జిల్లా స్థాయి అధికారిని కించపరిస్తే ఐపీఎస్‌ అధికారుల సంఘం, జిల్లా పోలీసులు అసోసియేషన్‌ నేతలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెబ్‌ కార్యా లయంపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఫిర్యా దు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 11:22 PM