Share News

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:08 PM

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలి పారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
సుగవాసి బాలసుబ్రమణ్యం, జగన్‌మోహన్‌రాజును సన్మానిస్తున్న కార్యకర్తలు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు

వీరబల్లి, ఏప్రిల్‌ 13: రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలి పారు. శనివారం వీరబల్లి మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చి, గజమాలలతో జగన్‌మోహన్‌రాజు, బాల సుబ్రమణ్యం కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు రెడ్డెప్పరెడ్డి, సురేందర్‌ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తోళ్ల సురేంద్ర, మండల మహిళా అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ, మట్లి సర్పంచ్‌ నాగార్జునాచారి, మాజీ సర్పంచులు నేతి రమణ, వెంకటరామరాజు, బొం గాని మల్లికార్జున, గ్రామ కమిటీల అధ్యక్షులు, మైనార్టీ, ఎస్సీ, బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..

ఒంటిమిట్ట: పెన్నపేరూరు గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఇంట్లో టీడీపీ అభ్యర్థి సుగవాసి మాట్లాడుతూ మండలం లోని ప్రతి టీడీపీ కార్యకర్తను గుర్తించి గౌరవిస్తానని ప్రతి ఒక్కరూ పార్టీకి అవసరమని అందరినీ కలుపుకోవడమే తన ఉద్దేశమని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేసి టీడీపీ ్ధ విజయానికి కృషి చేయాలని ఆయన అభ్యర్ధించా రు. క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసిన వారిని గుర్తించి గౌరవిస్తామన్నారు. అనంతరం నాయకు లతో కలిసి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో ఎలాంటి గ్రూపులు లేకుండా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు అడ్వకేటు రామదాసు, గంజి సుబ్బరాయుడు, జింక శివ, శ్రీనివాస్‌ నాయుడు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కోదండరామాలయంలో పూజలు

సిద్దవటం: సిద్దవటం మండలం టక్కోలి ఎస్సీ కాలనీలోని సీతారామాలయాన్ని సుగవాసి బాలసుబ్రమణ్యం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలంలో ఏప్రిల్‌ 16 నుంచి ఇంటింటి ప్రచారం చేస్తామన్నారు. కాగా, తాగునీటి సమస్యపై స్థానిక మహిళలు ఆయనకు ఫిర్యాదు చేయగా, కూతవేటు దూరంలో పెన్నానది ఉండగా కాలనీవాసులకు తాగునీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉండగా కొన్ని వాగ్దానాలు ఇవ్వలేమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:08 PM