Share News

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:41 PM

మండ లంలోని టంగుటూరులో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన బండ లాగుడు పోటీలను జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రారం భించారు.

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
బండ లాగుతున్న ఎద్దులు

నందలూరు, మార్చి 12 : మండ లంలోని టంగుటూరులో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన బండ లాగుడు పోటీలను జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రారం భించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె రమేష్‌కు చెందిన ఎడ్లు మొదటి స్థానంలో, ప్రొద్దుటూరు భాస్కర్‌రెడ్డికి చెందిన ఎద్దులు రెండో స్థానంలో, నందలూరు షేక్‌ హబీబుల్లాకు చెందిన ఎడ్లు మూడో స్థానంలో, కడప రమణారెడ్డికి చెందిన ఎడ్లు నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలు వరుసగా రూ.50వేలు, 40, వేలు, రూ.30 వేలు, రూ20 వేలు నగదు బహుమతులు అందుకున్నారు. ఈ మొత్తాల ను వరుసగా ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, చుక్కా వెంకటేశ్వరయ్య , బయనబోయిన భాస్కర్‌, గీతాల నరసింహారెడ్డి అందజేశారు. బయనబోయిన భాస్కర్‌ యాదవ్‌, గుజ్జల ఈశ్వరయ్య, మంచా మురహరి, మంచా ఫణీంద్ర పోటీలను పర్యవేక్షించారు. ఎస్‌ఐ మహమ్మద్‌ అబ్దుల్‌జహీర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 12 , 2024 | 10:41 PM