200 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణ!
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:06 PM
మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించి కంచెలు వేసుకు న్నారని టీడీపీ నాయకులు నాగేశ్వర్ నాయుడు, ప్రభాకర్‌నాయుడు, కోటేశ్వర్ రెడ్డి, తదితరులు ఆరోపించారు.

సంబేపల్లె, జూలె ౖ8: మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించి కంచెలు వేసుకు న్నారని టీడీపీ నాయకులు నాగేశ్వర్ నాయుడు, ప్రభాకర్‌నాయుడు, కోటేశ్వర్ రెడ్డి, తదితరులు ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నా రన్నారు. ఈ భూ ములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి ఎకరా ప్రభుత్వ భూమిని గుర్తించి, ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడంతో పాటు, మిగతా భూముల ను పేదలకు పంచి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌నాయుడు, శశిధర్‌రెడ్డి, శివ ప్రసాద్‌రెడ్డి, భయ్యారెడ్డి, శేఖర్‌రెడ్డి, శేఖర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, ఆలం సాబ్, రమణ, మట్లి వేణుగోపాల్ నాయుడు, మట్లి శ్రీనివా సులు నాయుడు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.