Share News

తంబళ్లపల్లి పారిశ్రామికాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:51 PM

టీడీపీ అధినేత చంద్ర బాబుతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని అంగళ్లు, ఇందిరానగర్‌, పోరెడి ్డవారిపల్లె, తుమ్మచెట్లపల్లె తదితర గ్రామాల్లో ఆయన జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

తంబళ్లపల్లి పారిశ్రామికాభివృద్ధికి కృషి
అంగళ్ళులో ప్రచారం చేస్తున్న టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి

కురబలకోట, ఏప్రిల్‌ 3: టీడీపీ అధినేత చంద్ర బాబుతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని అంగళ్లు, ఇందిరానగర్‌, పోరెడి ్డవారిపల్లె, తుమ్మచెట్లపల్లె తదితర గ్రామాల్లో ఆయన జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంబళ్ళ పల్లెను పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిం చారు. టీడీపీ అధికారంలోకి రాగానే తంబళ్ళ పల్లెను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వలస లను నివారించి శాశ్వత జీవనోపాధిని కల్పించ నున్నట్లు తెలిపారు. రాష్ర్టాభివృద్ధి కోసం చంద్ర బాబును తిరిగి సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ, ఆయన నాయకత్వానికి మద్దతు పలకాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి టీడీపీ గెలుపునకు పా టుపడాలన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా నని, మీరు ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి అయూబ్‌బాషా, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సు రేంద్ర, మండల కన్వీనర్‌ వై.జి.సురేంద్ర, తంబళ్ళ పల్లె తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, డిఆర్‌ వెంకట రమణారెడ్డి, రామచంద్ర, మోహన్‌రెడ్డ్డి,సదాశివ, తెట్టు ఉపసర్పంచ్‌ ముస్కీన్‌వలి, జయరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీటీఎం గంగమ్మకు సారె

పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలోని నడి వీధి గంగమ్మకు జయచంద్రారెడ్డి తన సతీమణి తో కలసి చీర, సారె సమర్పించారు. ఈ సంద ర్భంగా గ్రామ శివారు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎంపీటీసీ మా.జీ సభ్యుడు చంద్రశేఖర్‌(చిన్నా), చంద్రమోహన్‌ రెడ్డి భజంత్రి రామచంద్ర, జనసేన మండల అద్యక్షుడు శంకర, గ్రామ అద్యక్షుడు కత్తి ఆదినారాయణ, పాలగిరి రామాంజులు, కార్యం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:51 PM