Share News

స్కూల్‌ పాయింట్‌ వద్దకే విద్యాకానుక చేర్చాలి

ABN , Publish Date - May 25 , 2024 | 10:22 PM

పాఠశాలలు పునఃప్రారంభంలోపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాకానుక, పాఠ్యపుస్తకాలను చేర్చాలని ఎస్టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి డిమాండ్‌ చేశారు.

స్కూల్‌ పాయింట్‌ వద్దకే విద్యాకానుక చేర్చాలి
ఉపాధ్యాయ సమస్యలపై డీఈవోతో మాట్లాడుతున్న ఎస్టీయూ నేతలు

రాయచోటిటౌన, మే 25: పాఠశాలలు పునఃప్రారంభంలోపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాకానుక, పాఠ్యపుస్తకాలను చేర్చాలని ఎస్టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఎస్టీయూ నేతలతో కలిసి అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాశరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన 12వ తేదీలోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, విద్యాకానుకలను చేర్చాలన్నారు. ఎస్‌ఎస్‌సీ స్పాట్‌లో పాల్గొన్న ఇంగ్లీషు, ఫిజిక్స్‌, బయాలజీ, మ్యాథ్స్‌ టీచర్లకు పారితోషికం ఇచ్చినా, ఇంకా టీఏ, డీఏలను చెల్లించలేదన్నారు. గత, ప్రస్తుత వేసవి సెలవుల్లో నాడు- నేడు ఫేజ్‌-2 కింద పాఠశాలల్లో పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌వోకు ఇచ్చిన వినతిపత్రంంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వై. రవీంద్రనాఽథ్‌రెడ్డి, జిల్లా మైనార్టీ కన్వీనర్‌ ఎస్‌ఏ మున్వర్‌బాషా, జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, శంకర్‌రెడ్డి, ప్రదీప్‌, నాగరాజు, జగదీశ, గోపీక్రృష్ణ, భాస్కర్‌రెడ్డి, సునీర్‌, మధుసూదనరెడ్డి, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాల స్టాక్‌ పాయింట్‌ పరిశీలన

స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో గల పాఠ్యపుస్తకాల మండల స్టాక్‌ పాయింట్‌ను శనివారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాశరెడ్డి సందర్శించారు. రాయచోటి మండలానికి విద్యా కానుక-5 కింద ఇప్పటి వరకు సరఫరా అయిన 2,15,780 పుస్తకాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేంతవరకు పాఠ్యపుస్తకాలు దెబ్బతినకుండా వర్షాలకు తడవకుండా, ఎలుకల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ ఏడీ ప్రసాద్‌బాబు, మండల విద్యాశాఖ అధికారులు బాలాజీనాయక్‌, వెంకటశివారెడ్డి, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 10:22 PM