తగ్గుతున్న జలం.. ఆందోళనలో జనం
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:14 PM
మండలంలోని ముష్టూరు పంచాయతీలో గల బాహుదా ప్రాజెక్టులో నీరు తగ్గి ఎండి పోయేపరిస్థితి నెలకొంది.

బాహుదాలో తగ్గుముఖం పట్టిన నీరు తాగు, సాగుకు కష్టాలు తప్పవంటున్న ప్రజలు
నిమ్మనపల్లె, జూలై 5: మండలంలోని ముష్టూరు పంచాయతీలో గల బాహుదా ప్రాజెక్టులో నీరు తగ్గి ఎండి పోయేపరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లుగా వర్షాలు రాకపోవడంతో ఉన్న నీటిని పంట పొలాల కు వదలడం వలన ఈ సరిస్థితి నెలకొంది. ప్రభు త్వ లెక్కల ప్రకారం 2880ఎకరాలల్లో పంట సాగు కు అనుమతులు ఉన్నప్పటికి అంతకంటే ఎక్కువ గా 3వేల ఎకరాలకు పైగా రైతులు సాగు చేసేవా రు. బాహుదా ప్రాజెక్టు సామర్థ్యం 398ఎమ్‌సీఎఫ్‌టీ కెపాసిటీ కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే 2ఏళ్ల పాటు మూడు మండలాలకు తాగు, సాగు నీటికి ఇబ్బంది కలుగదు. అలాంటిది ప్రస్తుతం బాహుదాలో నీరు తగ్గి ఎండిపోయే స్థితిలో ఉంది. ముఖ్యంగా బాహుదా కాలువలు సక్రమంగా నిర్మిం చకపోవడమేనని రైతులు తెలిపారు. గత కాం గ్రెస్ ప్రభుత్వంలో ఎడమ, కుడి కాలువల నిర్మాణాలు చేపట్టినా అవి కాస్త సక్రమంగా నిర్మించపోగా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పంట పొలాలకు నీరు పోయే పరిస్థితి లేదు. ప్రస్తుత ఖరీ్‌ఫ్ సీజన లో వరి పంటకు నీళ్లు లేక బాహుదా కింద ఉన్న రైతులు వారి భూములలో గడ్డి నాటుకొని పాడి పశువులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసా కొందరికి మాత్ర మే అందుతున్నట్లు తెలుస్తోంది. ఎండా కాలం పోయి వర్షాకాలం వచ్చినా బాహుదాలో చుక్కనీరు చేరకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. తాగునీటికికి కూడా అవస్థలు పడాల్సివస్తుందేమో నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంలో రైతులు ఉద్యానపంటల వైపు మక్కువచూపుతున్నా అక్కడ కూడా సరైన ధరలేక రైతులు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా బాహుదా కాలువలు నిర్మించి నీటిని వృఽథా కాకుండా నీటిని పంట పొలాలకు వదిలితే ఉపయోగకరంగా ఉంటుందని రైతులంటున్నారు.
కాలువల మరమ్మతులకు చర్యలు
దీనిపై ఇరిగేషన ఏఈ శ్రీహరిరెడ్డి మాట్లాడుతూ కాలువల మరమ్మతుల కోసం చర్యలు చేపడుతామ న్నారు. ఇందు కోసం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే షాజహానబాషాతో సంప్రదింపులు జరిపి అనుమ తులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని ఆయన తెలిపారు.