డప్పు కళాకారులను ఆదుకోవాలి : డీహెచపీఎస్
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:07 PM
డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

రాయచోటిటౌన, జూలై 8: డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన రాయచోటి పట్టణంలోని డీహెచపీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డప్పు కళాకారుల పింఛన రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పెంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గుర్తింపు కార్డులు, డ్రస్సులు, గజ్జలు, డప్పులు లేకపోవడంతో డప్పు కళాకారులు ఉపాధికి దూరమవుతున్నారని తెలి పారు. వెంటనే ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులను మం జూరు చేయడంతో పాటు డ్రెస్సులు, గజ్జలు, డప్పులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల్లో వారి సేవలు వినియోగించుకొని తగిన పారితోషికాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీహెచపీఎస్ జిల్లా కోశాధికారి సుధాకర్, నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.