తాయిలాలు తెస్తున్న వారిని తరమండి!
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:01 AM
ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు వంటి తాయిలాలు తెస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొట్టా లని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ప్రజ లకు పిలుపునిచ్చారు.

ఫ పరిశ్రమలు, ఉద్యోగాలు ఎందుకు తేలేదో నిలదీయండి ఫ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదో ప్రశ్నించండి
ఫ ప్రజలకు టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపు ఫ సమష్టిగా పనిచేసి జయచంద్రారెడ్డిని గెలిపిద్దాం : కొండ్రెడ్డి
పీలేరు, మార్చి 5: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు వంటి తాయిలాలు తెస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొట్టా లని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ప్రజ లకు పిలుపునిచ్చారు. పీలేరు పట్టణం తిరుపతి రోడ్డులోని నాయీబ్రా హ్మణ, రజక, విశ్వబ్రాహ్మణ, జర్నలిస్టు కాలనీల్లో మంగళవారం ఆయన టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గురించి పట్టించుకోకుండా అక్రమ సంపాదనపై దృష్టి సారించి దోచుకున్న వైసీపీ నాయకులు సిగ్గూ ఎగ్గూ లేకుండా రూ.200లు కూడా విలువ చేయని చీరలు పంపిణీ చేస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, తమకు తాయి లాలు అవసరం లేదని, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోలేదని, పరిశ్రమలు, ఉద్యోగాలు ఎందుకు తేలేకపో యారని వైసీపీ నాయకులను ప్రశ్నించాలని కిశోర్ ప్రజలను కోరారు. తెలుగుదేశం బీసీలకు పుట్టినిల్లు లాంటిదన్నారు. టీడీపీ తరపున పోటీచేస్తున్న తనను ఎన్నికల్లో ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు రాజన్న, ఆంజి, వెంకటరత్నం, రమణ, రమేశ, ముఖేష్, వాసు, బాలాజీ, జయరాం, లక్ష్మయ్య, రాధా, టీడీపీ నాయకులు పురుషోత్తంరెడ్డి, శివారెడ్డి, బోడింపల్లె సూరి, పిట్టా భాస్క రరెడ్డి, ప్రభాకర్ రాజు, ధర్మరాజు, ఆంజి, పురం రెడ్డమ్మ, సుభద్రమ్మ, సాధన, లక్ష్మీకాంతమ్మ, షమ, మీనా, చందన, స్వర్ణ, కళావతి, రెడ్డిరాణి, రమాదేవి, నాగేంద్ర, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సమష్టిగా పనిచేసి జయచంద్రారెడ్డిని గెలిపిద్దాం: కొండ్రెడ్డి
తంబళ్లపల్లె, మార్చి 5: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో ఎటువంటి వర్గ విభేదాలకు తావులేకుండా కేడరంతా సమన్వయంతో సమష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డిని గెలిపిద్దామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడి పిలుపునిచ్చారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్య దర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డిని తంబళ్లపల్లెలోని ఆయన నివాసంలో జయ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు టీడీపీ సీనియర్ నాయకులతో కలసి ఎన్నికల సంగ్రామంపై చర్చించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ..కొండ్రెడ్డి గత రెండేళ్లుగా వైసీపీ అరాచకాలు, అక్రమ కేసులను ఎదుర్కొని టీడీపీ పటిష్టతకు కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచాడన్నారు. టీడీపీ సీనియర్ నాయకుల, సలహాలు సూచనలతో ప్రజలను కలుపుకుని రానున్న ఎన్నికల సంగ్రామంలో విజయ డంకా మోగించి చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. అనంతరం కొండ్రెడ్డి మాట్లాడు తూ...సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజలు, రైతులు సమస్యలు తీర్చడానికి వచ్చిన జయచంద్రారెడ్డిని ఒక్కసారి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ భయప డవద్దని ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉండి ఆదుకుంటామని ఇరువురు నేతలు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్య క్షుడు రెడ్డప్పరెడ్డి, మదనమోహనరెడ్డి, సోముశేఖర్, సుబ్రమణ్యం, తాతిరెడ్డి, వీరాంజినేయులు, పీర్లమాబు, సుబహాన, ధనుంజయరాయల్, మునాఫ్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం
ములకలచెరువు, మార్చి 5: రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తంబ ళ్లపల్లె టీడీపీ అభ్యర్ధి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పోలింగ్ బూత కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, నాయకులు శేఖర్‌నాయుడు, రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్యాల నాగరాజు, ఉమాశంకర్, గంగాద్రి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.