Share News

దోస పంటకు ఎల్లోమజాక్‌ దెబ్బ

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:05 AM

బి కొత్తకోట మండల పరిధి లోని కొన్ని గ్రామాల్లో సాగు చేసిన దోస పంటకు ఎల్లోమజాక్‌ వైరస్‌ సోకడంతో పంటబాగా దెబ్బతిం టోంది.

దోస పంటకు ఎల్లోమజాక్‌ దెబ్బ
ఎల్లో మజాక్‌ వైరస్‌ సోకిన దోస తోట

బి కొత్తకోట, మార్చి25: బి కొత్తకోట మండల పరిధి లోని కొన్ని గ్రామాల్లో సాగు చేసిన దోస పంటకు ఎల్లోమజాక్‌ వైరస్‌ సోకడంతో పంటబాగా దెబ్బతిం టోంది. మండలంలోని చండ్రమాకులపల్లె కు చెందిన సన్నకారు రైతు ప్రతి ఏడాది రంజాన మాసాన్ని దృస్టిలో ఉంచుకుని దోస, కర్బూజా పంటలను సాగు చేసేవాడు. ఈ ఏడాది కూడా తన రెండెకరాల పొలం లో దోసపంటను సాగు చేశాడు. పంట పెట్టి 30 రోజు లు కావస్తోంది. రూ.33వేలు పెట్టి విత్తనాలు కొనుగోలు చేయడంతోపాటు, దుక్కి, డ్రిప్‌, మల్చింగ్‌ పేపరుతో పాటు, కూలీలు, రసాయన ఎరువులు, మందుల స్ర్పేయింగ్‌ కోసం ఇప్పటిదాకా 1.80 లక్షలు ఖర్చు చేశా డు. ఇప్పడు ఎల్లోమజాక్‌ వైరస్‌ సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిం ది. చెట్లను పీకి పడేయడం తప్ప, మరో మార్గం లేదంటున్నాడు. కాగా ఇదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, డి. నాగరాజురెడ్డి రెండు ఎకరాలు, టి రామిరెడ్డి 1.50, యం వెంకట్రమణారెడ్డి 2.25, పి. సుబ్బిరెడ్డి 3 ఎకరాలు, యం క్రిస్నారెడ్డి ఆరు ఎకరాలు పి. బయ్యారెడ్డి నాలుగు ఎకరాలలో దోస పంటను సాగుచేసి నష్టపోయారు. వీరే కాదు మండల వ్యాప్తం గా, నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు దాదాపు 300 ఎకరాలలో ఎల్లోమజాక్‌ వైరస్‌ ధాటికి సుమారు రూ.4 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.

ఎల్లోమజాక్‌ వైరస్‌ అంటే...

ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు మించినప్పడు వేడితాకిడికి 20-25 రోజుల దోసపంటకు ఈ ఎల్లోమజాక్‌ వైరస్‌ సోకుతుంది. ఆకులలో వెనుకభాగాన కోడిపేను లాగా ట్రిప్స్‌ ఏర్పడతాయి. దానికి తోడు తెల్లదోమ రసాన్ని పీల్చేస్తుంది. ఫలితంగా దోసతీగ ఆకులన్నీ పసుపురం గులోకి మారి. ఎదుగుదల లేక పిందెలు రాలిపోతాయి. ఈ వైరస్‌కు ఎక్స్‌పో నస్‌, డెలిగేట్‌, గ్రేశియా లిక్విడ్‌ లకు ఇతర కాంబినేసన కలిపి స్ర్పే చేస్తే వైరస్‌ అదుపు లోకి వచ్చేది. కానీ ప్రస్తుతం అదికూడా పనిచేయడం లేదని బాధితరైతు లు వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి...

తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైరస్‌ సోకి సుమారు 300 ఎకరాలలో దోసపంట దెబ్బతిందని రైతులు పేర్కొంటున్నారు. కొందరు దోసతీగలను తొలగించి, అదే పేపర్‌ మీద మరో పంటను నాటుతుండగా, మరికొందరు చివరి వరకు ప్రయత్నించి స్ర్పేయింగ్‌ల కోసం రూ. లక్షలు వెచ్చించి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందిచాలని దోసపంట బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:05 AM