Share News

ఉపాధికేదీ అండ..!

ABN , Publish Date - May 20 , 2024 | 11:26 PM

భానుడు ఉగ్రరూపం దాల్చాడంతో ఎండలు మండిపోతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయ పడిపోతున్నారు.

ఉపాధికేదీ అండ..!
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

మండుటెండలో కూలీల పాట్లు

తాగునీటికి నోచుకోని దయనీయ పరిస్థితి

పనిచేసే ప్రదేశాల్లో టెంట్లు, మెడికల్‌ కిట్లు కరువు

వైసీపీ పాలనలో ఊసేలేని కనీస వసతులు

ములకలచెరువు, మే 20: భానుడు ఉగ్రరూపం దాల్చాడంతో ఎండలు మండిపోతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయ పడిపోతున్నారు. ఇంత ఎండలోనూ ఉపాధి కూలీలు పనులు చేస్తు న్నారు. ఎండలకు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నా...పొట్టకూటి కోసం పనులకు వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంది. అలాంటి వారిపైన ప్రభుత్వం కనీస కనికరం చూపలేదు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాల నలో ఉసాధి కూలీలకు చుక్కలు కన్పించాయి. కూలీలు పనిచేసే చోట కనీస వసతులు సైతం కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విస్మరించిం ది. కనీస వసతులైన తాగునీటి వసతి గాలికి వదిలేసింది. పని మధ్య లో కాసేపు ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేయాల్సిన టెంట్లు ఎక్కడా కన్పించడం లేదు. అత్యవసర సమయాల్లో, అస్వస్థతకు గురైన ప్పుడు ప్రధమ చికిత్సలు చేసుకోవడానికి మెడికల్‌ కిట్లు లేవు. ఉపాధి కూలీలకు పనిచేసే చోట కల్పించాల్సిన కనీస వసతుల గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు గ్రామాలకు దూరంగా ఉన్న కొం డలు, గుట్టల ప్రాంతాల్లో పనులు కల్పిస్తుండడంతో దూరాభారమైనా పనులకు వెళ్లాల్సి వస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ముల కలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లో ప్రతి రోజూ సుమారు 22వేల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఫారంపాండ్స్‌, ఫీడ్‌ కాలువలో పూడికతీత పనులు, క్యాటిల్‌ పాండ్స్‌, డగౌట్‌ పాండ్స్‌, రింగ్‌ ట్రెంచలు, కండిత కంధకాలు, కొండల దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కంధకాలు తదితర పనులు చేస్తున్నారు. పనులు చేసే చోట కనీస వసతైన తాగునీటి సౌకర్యం కల్పించకపోవ డంతో ఉపాధి కూలీల గొంతు తడా రుతోంది. ఇళ్ల నుంచి బాటిళ్ళలో తెచ్చుకుంటున్న నీరు చాలకపోవ డంతో కూలీలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం గా మారాయి.

కూలీలకు గతంలో కల్పించిన వసతులు

ఉపాధి కూలీలకు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గతంలో టార్పాలింగ్‌ పట్టలు పంపిణీ చేసేవారు. తాగునీటితో పాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేవారు. అత్యవసర సమయా ల్లో, కూలీలు అస్వస్థతకు గురైనప్పుడు, పని చేస్తున్న సమయంలో దెబ్బలు తగిలితే ప్రధమ చికిత్స కోసం మెడికల్‌ కిట్లు అందుబా టులో ఉంచేవారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మార్చి నుంచి మే నెల వరకు అదనపు అలవెన్సులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డపారలు, పారలు పంపిణీ చేసేవారు. సొంతం గా తెచ్చుకుని వినియోగించే వారికి అదనంగా వేతనం చెల్లించేవారు.

ప్రస్తుతం అమలు తీరు

మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ మాట అటు ఉంచితే కనీసం తాగు నీటి వసతి కూడా కల్పించడం లేదు. టార్పాలిన పట్టలు పంపిణీ చేయకపోవడంతో కూలీలు ఎండకు అల్లాడు తూ వానకు తడుస్తున్నారు. ఎండకు, వర్షానికి చెట్ల కిం ద సేద తీరుతున్నారు. గడ్డపారలు, పారల పంపిణీ లే దు. కూలీలు ప్రమాదాలకు గురైతే ప్రథమ చికిత్సలు అం దడం లేదు. ఐదేళ్లుగా వేసవి భత్యం అందడం లేదు. వేసవిలో 20 నుంచి 30 శాతం అదనంగా అలవె న్సు చెల్లించేవారు. గరిష్ట వేతనం రావాలంటే ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్ధితి నెలకొంది.

కనీస వసతులు కల్పించడం లేదు

పని ప్రదేశంలో తాగునీటి వసతి కూడా కల్పించడం లేదు. ఇంటి నుం చి బాటిళ్ళలో నీరు తెచ్చుకుంటున్నా ఏ మూలకు చాలడం లేదు. ఎం డకు కొంత సేపు సేద తీరుదామన్నా పనులు చేసే చోట నీడ కరువైం ది. నీడ కోసం చెట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నాం. గతంలో నీడ కల్పించుకునేందుకు పది మందికి కలిపి ఒక టార్పాలిన పట్ట ఇచ్చేవారు. మెడికల్‌ కిట్లు అందుబాటులో లేవు. కొండ, గుట్ట ప్రాంతా ల్లో పనులు చేస్తుండడంతో ప్రమాదాలకు గురై గాయపడితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆస్పత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది.

- సుబ్రమణ్యం ఉపాధి కూలీ, సానేవారిపల్లె, ములకలచెరువు

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం

ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కూలీలకు నీడ కోసం స్థానికంగా దొరికే ప్లాస్టిక్‌ పట్టలు, కానుగాకుతో నీడ వసతి కల్చించాం. ఓఈర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశాం. చాలా వరకు మట్టికుండల్లో నీటి వసతి కల్పించాం.

-మధుబాబు, డ్బామా ఏపీడీ, తంబళ్లపల్లె

Updated Date - May 20 , 2024 | 11:26 PM