Share News

రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పవద్దు

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:08 PM

పలు గ్రామాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని వారి సమస్యలను తక్ష ణం పరిష్కరించాలని మదనపల్లె ఆర్డీవో హరిప్రపసాద్‌ అధికారులను ఆదేశించారు.

రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పవద్దు
పెద్దతిప్పసముద్రం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్న మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌

అధికారులను ఆదేశించిన మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌

పెద్దతిప్పసముద్రం జూలై 5 : పలు గ్రామాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని వారి సమస్యలను తక్ష ణం పరిష్కరించాలని మదనపల్లె ఆర్డీవో హరిప్రపసాద్‌ అధికారులను ఆదేశించారు. పెద్దతిప్పసముద్రం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డీవో హరిప్రపసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయం లోని పలు రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశమైన ఆర్డీవో మాట్లాడుతూ వీఆర్వోలు తక్షణం భూసమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించి రైతుల కు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కార్యాలయ ఆవ రణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆఫీసులో చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకుని చెత్తచెదారాన్ని అందులోనే వేసే విధంగా చూసుకోవాలన్నారు. కాగా అంతకు ముందు ఆంద్రప్రదేశ లోకాయుక్తా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డిని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ చెన్నరాయునిపల్లెకు చేరుకుని మర్యా దపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్ర మంలో తహసీల్దార్‌ నరసింహరావు, డిప్యూటీ తహసీల్దార్‌ విద్యాసాగర్‌, మొలకలచెరువు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి, టీడీపీ యువనాయకుడు మనోజ్‌జ యంతరెడ్డి, పీటీఎం ఎస్‌ఐ రవీంద్రబాబు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో ఉచిత ఇంటి జాగాలంటూ హైడ్రామా

ఫఆర్డీవో హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

బి.కొత్తకోట, జూలై 5: బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని బెంగ ళూరు రోడ్డులో తనకు హక్కు ఉన్న జాగాలో ఉచితంగా ఇంటి జాగాలు ఇస్తానంటూ పట్ణణానికి చెందిన ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. సర్వే నెం బరు 245-243 భూమిలోనికి సుమారు వంద మందిని వెంటబెట్టుకెళ్లి తానే ఒక్కొక్కరికీ వరుసగా స్థలం చూపించసాగాడు. విషయం తెలియ డంతో ఆ స్థలాన్ని చదును చేయించిన పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అనుచరులతో వెళ్లి అడ్డుకున్నాడు. ఈ భూమిపై హక్కు తమదంటూ గొడవకు దిగాడు. ఈ విషయం పోలీసులకు తెలి యడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దారు కార్యాల యంలో తేల్చుకోవాలంటూ ఇరువురిని పంపివేశారు. దీంతో ఇంటి జాగా లు ఇస్తానని చెప్పిన వ్యక్తి వారినందరినీ వెంటబెట్టుకుని తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే కార్యాలయ పరిశీల నకు వచ్చిన మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌కు విషయాన్ని మొరపె ట్టుకున్నారు. తనకు పిత్రా ర్జితంగా ఈ భూమి సంక్రమించిందని రెవె న్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆనలైన చేయలేదని అతను పేర్కొన్నాడు. దీనిపై తహసీల్దారుకు వివరంగా ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తామని ఆర్డీవో పేర్కొన్నారు.

ఆధారాలుంటే పరిశీలిస్తాం: తహసీల్దార్‌

ఇంటి జాగాలు ఉచితంగా ఇస్తానంటూ చెబుతున్న వ్యక్తికి భూమిపై ఏమి హక్కు ఉందో ఆధారాలను బట్టి విచారిస్తామని తహసీల్దారు పుణ్య వతి తెలిపారు. ఇరుపక్షాలు భూమిపై ఉన్న హక్కును నిరూపించుకుని భూమి పొందవచ్చని లేదంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించవచ్చని తహసీల్దారు తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 11:08 PM