Share News

విధులకు వైద్యులు డుమ్మా : డీఎంహెచ్‌వో ఆగ్రహం

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:05 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇద్దరు వైద్యాధికారులు ఒకే రోజు అనుమతి లేకుండా విధులకు గైర్హా జరు కావడంపై డీఎంహెచ్‌వో కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులకు వైద్యులు డుమ్మా : డీఎంహెచ్‌వో ఆగ్రహం
హాజరు పట్టికను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో కొండయ్య

సంబేపల్లె, ఏప్రిల్‌ 5: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇద్దరు వైద్యాధికారులు ఒకే రోజు అనుమతి లేకుండా విధులకు గైర్హా జరు కావడంపై డీఎంహెచ్‌వో కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవ పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయం లో ఆస్పత్రిలో ఉండాల్సిన ఇద్దరు వైద్యులు విధుల్లో లేకపోగా, రోగులకు సిబ్బంది మందులు పంపిణీ చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన ఆయన డాక్టర్లకు ఫోన్‌ చేసి విధులకు గైర్హాజరు కావడంపై ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

Updated Date - Apr 05 , 2024 | 11:05 PM