Share News

డిమాండ్లు సాధించేదాకా విధుల్లో చేరం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:11 AM

తమ న్యాయమైన డిమాండ్లు సాధించు కునేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశా రు.

డిమాండ్లు సాధించేదాకా విధుల్లో చేరం
బి.కొత్తకోటలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

ఫ కలెక్టర్‌ నోటీసు ప్రతులను దహనం చేసిన అంగన్వాడీలు ఫ వివిధ రూపాల్లో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు

మదనపల్లె టౌన, జనవరి 4: తమ న్యాయమైన డిమాండ్లు సాధించు కునేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశా రు. గురువారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు 23వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ లోపల విధుల్లో చేరని అంగన్వాడీలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రకటన ఇవ్వడం శోచనీయమన్నారు. తామేమి అలవికాని డిమాండ్లు కోరడం లేదని, పాదయాత్ర సందర్భం గా సీఎం జగన ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామ న్నారు. నిత్యం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలదించే తమకు గౌరవ వేతనం బదులు కనీస వేతనం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ప్రకటనలిస్తే బెదరమని చెబుతూ ప్రకటన ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకు రాళ్లు మధురవాణి, గంగాదేవి, సుజన, గీత, సెక్టార్‌ లీడర్లు, మూడు మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: వేతనాల పెంపు, గ్రాట్యూటి అమలు, యాప్‌ రద్దు చేసి పనిభారం తగ్గింపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 24వ రోజుకు చేరుకుంది. తంబళ్లపల్లె ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల అంగన్వాడీలు, హెల్పర్లు తంబళ్లపల్లె మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ యువ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంత రం అంగన్వాడీలు కోసువారిపల్లె రోడ్డులోని వాటర్‌ ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలుపుతూ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించా లని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూ నియన నాయకురాళ్లు కరుణశ్రీ, సులోచన, స్వరూపారాణి, సరస్వతీ, ఉమాదేవి, గౌరి, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: తమ డిమాండ్ల పరిష్కారం కోసం బి.కొత్తకోట ఐసీడీ ఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమను బం దీలుగా మార్చింది..అన్నట్లుగా తమ చేతులు కట్టేసుకుని నిరసన తెలి పారు. విధులకు హాజరు కావాలని జిల్లా అధికారులు పంపిన ఆదేశాల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన లీడర్లు శ్రీవాణి, కుమారి, పీటీయం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: వేతనాల సమస్య పరిష్కరించమని సామరస్యంగా విన్నవించుకుంటుంటే అంగన్వాడీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటా మని అధికారులు బెదిరించడం ఏమిటనిఅంగన్వాడీ కార్యకర్తలు ధ్వజ మెత్తారు. గురువారం వాల్మీకిపురం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద జిల్లా అధికారుల నుంచి వచ్చిన నోటీసుల ప్రతులను దహనం చేస్తూ సీఎం జగనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీ కార్యకర్తలు విధులలో చేరే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీలకు సీఎం జగన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజీ, నజీమున్నీసా, గులాబ్‌జాన, సంపూర్ణ, లక్ష్మీప్రసన్న, నరసమ్మ, దేవసేన, రెడ్డిరాణి, కలి కిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ అంగన్వాడీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:11 AM