Share News

సంస్కృతీ, సంప్రదాయాలు కొనసాగించాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:25 AM

తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు విలువ నిస్తూ, వాటిని కొనసాగించాలని ఆర్డీవో ఎంఎస్‌మురళి పిలుపునిచ్చా రు.

సంస్కృతీ, సంప్రదాయాలు కొనసాగించాలి
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

ఫ ఆంధ్రజ్యోతి-ఏబీఎన ముత్యాల ముగ్గుల పోటీలో ఆర్డీవో మురళి ఫ మదనపల్లెలో నిర్వహించిన పోటీలకు అనూహ్య స్పందన

మదనపల్లె, జనవరి 7: తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు విలువ నిస్తూ, వాటిని కొనసాగించాలని ఆర్డీవో ఎంఎస్‌మురళి పిలుపునిచ్చా రు. స్థానిక జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆంధ్ర జ్యోతి-ఏబీఎన ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గులపోటీలు జరిగాయి. ఇందులో కెన రాబ్యాంకు, ఎయిమ్స్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ బెంగళూరు, స్వర్లసీమ సుకేత నలు స్పాన్సర్‌గా, స్థానికంగా శ్రీనివాస డిగ్రీ కళాశాల, శ్రీకాంత గాజుల పౌండేషనలు లోకల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళి ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికొచ్చే సమయమని, ముఖ్యంగా ఇంటిల్లిపాదీ సుఖ సంతాలతో జరుపుకునే పండువగా పేర్కొన్నారు. శ్రీకాంత గాజుల పౌండేషన అధినేత శ్రీకాంత మాట్లాడుతూ అంతరిం చిపోతున్న సంప్రదాయాలను కాపాడేందుకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలు అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించేందుకు తనవంతు సహకారం ఉం టుందన్నారు. శ్రీనివాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయాలను కొనగిస్తూ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముగ్గులపోటీలకు అనూమ్య స్పందన లభిం చిందన్నారు. ఉన్నతపాఠశాల హెచఎం సుబ్బారెడ్డి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన మోహనవళి, ఉషారాణిలు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలకు ఇంతమంది మహి ళలు, భావితరాల యువతులు పాల్గొనడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన నిర్వ హించిన ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇందులోభాగంగా పడమటి ప్రాంతాల నుంచి 76మంది ఔత్సాహిక మహిళలు, యువతులు రంగువల్లుల పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో డీవీ పూర్ణ మొదటి బహుమతి, ఎస్‌.పద్మ రెండో బహుమతి, బి.మల్లిక మూడో బహుమతి కైవసం చేసుకున్నారు. వారికి మొదటి బహుమతి కింద రూ.6వేల విలువ చేసే మిక్చర్‌ గ్రైండర్‌, రెండో బహుమతి కింద రూ.4వేల విలువ చేసే ఎలక్ర్టికల్‌ రైస్‌ కుక్కర్‌, మూడో బహుమతి కింద రూ.3వేల విలువచేసే కుక్కర్‌ అందజేశారు. ముఖ్య అతిథిగా మదనపల్లె ఆర్డీవో ఎం.ఎస్‌.మురళి, స్పాన్సర్స్‌ శ్రీనివాసడిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ ఎన.శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత గాజుల పౌండేషన వ్యవస్థాపకుడు శ్రీకాంతలు బహుమతులు అందజేశారు. అలాగే తర్వాతి 15 స్థానాల్లో నిలిచిన ఎం.రాజేశ్వరి, వి.రెడ్డిరాణి, ఎ.పద్మ, వై.వనజకుమారి, కె.రెడ్డికుమారి, టి.సరోజ, సి.రమణమ్మ, టి.హేమలత, జి.రేణుక, ఎస్‌.రెడ్డికుసుమ, జి.సులోచన, బి.భాగ్యలక్ష్మి, ఎస్‌.హేమలత, టి.గిరిజ, డి.శ్రావణిలకు శ్రీకాంత గాజుల పౌండేషన తరపున ప్రత్యేక బహుమతులు అందజేశారు. దీంతోపాటు ఈ పోటీల్లో పాల్గొన్న 76 మందికి ఇద్దరు స్పాన్సర్స్‌ కన్సోలేషన బహుమతులు అందజేశారు. అలాగే శ్రీవారి సప్లయర్స్‌ అధినేత ఎన.బాలగంగాధర్‌రెడ్డి..ఈ ముగ్గుల పోటీలకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్ర మంలో ఆర్డీవో మురళి, సతీమణి అరుణ, మదనపల్లె, తంబళ్లపల్లె, పుం గనూరు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:25 AM