Share News

కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - May 24 , 2024 | 11:14 PM

మదనపల్లె నియోజకవర్గం సార్వత్రిక ఎన్ని కల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీ

కౌంటింగ్‌  ప్రశాంతంగా నిర్వహించాలి
మదనపల్లె కౌంటింగ్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్న ఆర్‌వో హరిప్రసాద్‌, డీఎస్పీ ప్రసాదరెడ్డి

గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు, బాణసంచా పేల్చడం చేయకూడదు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్వో, డీఎస్పీ

మదనపల్లె టౌన, మే 24: మదనపల్లె నియోజకవర్గం సార్వత్రిక ఎన్ని కల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీ య పార్టీల ప్రతినిధులతో రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు అవగాహన పెంచుకోవాలని రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిఽధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌వో మాట్లాడుతూ ఎన్నికల కమిషన ఆదేశాలతో జూన 4వ తేదీన రాయచోటిలోని సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో మద నపల్లెకు సంబంధించి ఓట్లను కౌంటింగ్‌ చేస్తామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 7గంటలకే కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని, తొలుత ఎన్నికల అబ్జర్వర్‌, రాజకీయ పార్టీ ఏజెంట్ల సమక్షంలో సా్ట్రంగ్‌ రూమ్‌ను తెరుస్తామని, అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకున్నాక పోస్టల్‌బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రానికి తరలిస్తామ న్నారు. అక్కడ14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, తొలుత పోస్టల్‌ బ్యాలె ట్‌లను లెక్కించాక 18 రౌండ్లలో ఓట్లు లెక్కింపు పూర్తిచేస్తాము. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చన్నారు. లెక్కింపు పూర్తి అయ్యాక రాజకీయ పార్టీల ఏజెంట్లు, అబ్జర్వర్‌ సంతకాలు చేశాకనే ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. డీఎస్పీ ప్రసాదరెడ్డి మాట్లా డుతూ కౌంటింగ్‌ పూర్తి అయ్యాక ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేయకూడదని, బాణసంచా పేల్చడం ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా కవ్విం పు చర్యలు దిగితే కఠినం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఆర్‌వోలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

పీలేరు 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

పీలేరు, మే 24: ఓట్ల లెక్కింపులో భాగంగా పీలేరు అసెంబ్లీ నియోజక (జూన 4న)వర్గ లెక్కింపును 21 రౌండ్లుగా నిర్ణయించినట్లు పీలేరు ఈఆర్‌వో రమ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, దానిలో పాల్గొనే ఏజెంట్ల నియామకం, లెక్కింపు కేంద్రంలో పాటించాల్సిన నియమాలపై శుక్రవారం పీలేరు తహసీల్దారు కార్యాలయంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ లెక్కింపును 21 రౌండ్లుగా నిర్ణయించి 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లను పెట్టుకోవాలని, ఆ 14 మందికి అదనంగా ఒక జనరల్‌ ఏజెంటును పెట్టుకోవచ్చునన్నారు. ఏజెంట్ల వివరాలను వచ్చే నెల 1వ తేదీ సాయంత్రంలోపు పీలేరు తహసీల్దారు కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు. పీలేరు తహసీల్దారు మహబూబ్‌ బాషా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు జరిగే రోజున ఏజెంట్లుగా నియమితులైన వారందరూ ఉదయం 7 గంటలకల్లా కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించరన్నారు. కౌంటింగ్‌ ఏజెం ట్లకు రిలీఫ్‌ ఏజెంట్లు ఉండరని, ఏజెంట్లుగా వచ్చే వారు ఎన్నిక ఫలితం తేలేవరకు కౌంటింగ్‌ గదిలో ఉండే విధంగా మానసికంగా సిద్ధమై రావాలన్నారు. పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 9వ తేదీ వరకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్టు అమలులో ఉంటుం దని, తద్వారా అప్పటి వరకు 144 సెక్షన, 30 పోలీసు యాక్టు కూడా అమలులో ఉన్నట్టేనన్నారు. 144 సెక్షన అమలులో ఉండగా ఎటువంటి సభలు, ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, కౌంటింగ్‌ జరిగే సమయంలో బాణాసంచా పేల్చడం, గుంపులుగా గుమిగూడడం వంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని అభ్యర్థులు తమ అనుచరులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఇక సాధారణ ప్రజలు కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా తమ ఇళ్లలోనే ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపాటి సుభాన, కాంగ్రెస్‌ నేత దుబ్బా శ్రీకాంత, స్వతంత్ర అభ్యర్థులు మం జునాథ్‌, అంకాళేశ్వరి, పి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:14 PM