Share News

ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా చేపట్టాలి

ABN , Publish Date - May 29 , 2024 | 12:03 AM

సార్వత్రిక ఎన్ని కల ఓట్ల లెక్కింపును కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు నిష్పక్షపా తంగా చేపట్టాలని మదనపల్లె, తంబళ్లప ల్లె నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు హరిప్రసాద్‌, రాఘవేంద్రలు పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా చేపట్టాలి
శాంపిల్‌ కంట్రోల్‌ యూనిట్‌ను వివరిస్తున్న ఆర్‌వోలు హరిప్రసాద్‌, రాఘవేంద్ర

తప్పులు చేస్తే..సస్పెన్షన తప్పదు ఆర్‌వోలు హరిప్రసాద్‌, రాఘవేంద్ర

మదనపల్లె టౌన, మే 28: సార్వత్రిక ఎన్ని కల ఓట్ల లెక్కింపును కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు నిష్పక్షపా తంగా చేపట్టాలని మదనపల్లె, తంబళ్లప ల్లె నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు హరిప్రసాద్‌, రాఘవేంద్రలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో మదనపల్లె, పీలేరు, తంబళ్లప ల్లె నియోజక వర్గాలకు సంబంఽధించి కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆర్‌వోలో హరిప్రసాద్‌, రాఘవేంద్రలు మాట్లాడుతూ ఈవీఎంలకు అనుసంధానమైన కంట్రోల్‌ యూనిట్‌లోని స్పెషల్‌ ట్యాగ్‌ను తెరవకూడదని అలా చేస్తే సస్పెన్షకు గురవుతారన్నారు. కంట్రోల్‌ యూనిట్‌లో వచ్చిన ఓట్ల లెక్క, మైక్రో అబ్జర్వర్‌ నమోదు చేసుకున్న ఓట్ల లెక్క ఒక్కటిగా తేలాలన్నారు. అలా తేలని పక్షంలో లెక్కింపు సిబ్బంది చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఈవీ ఎంలోని ఓట్లను జాగ్రత్తగా లెక్కించి నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలె ట్లు లెక్కించేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. మూడు నియోజకవర్గాల నుంచి 200 మంది కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:03 AM