Share News

అవినీతి వైసీపీకి ఇక నూకలుచెల్లాయి

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:07 PM

అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వ పాలనకు నూకలు చెల్లాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు పార్టీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

అవినీతి వైసీపీకి ఇక నూకలుచెల్లాయి
చింతపర్తిలో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని గజమాలతో స్వాగతిస్తున్న టీడీపీ జనసేన నాయకులు, యువత

తల్లిని చెల్లిని చూడనోడు రాష్ట్ర పాలకుడు కావడం సిగ్గుచేటు పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధ్వజం

వాల్మీకిపురం, మార్చి 16: అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వ పాలనకు నూకలు చెల్లాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు పార్టీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తల్లిని, చెల్లిని చూడనో డు మన ఆంధ్రప్రదేశ సీఎం కావడం రాష్ట్ర దౌర్భాగ్యమని ఆయన ధ్వజ మెత్తారు.. శనివారం వాల్మీకిపురం మండలంలోని మద్దెలచెరువుపల్లె, పాతకోటపల్లె, మేకలవారిపల్లె, చారావండ్లపల్లె తదితర గ్రామాలలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారం టీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా గ్రామాలలో ఇంటింటా సూప ర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిం చారు. చింతపర్తి మార్కెట్‌ యార్డు వద్ద నుంచి చారావాండ్లపల్లె వరకు భారీ ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నల్లారి కిశోర్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రజలంతా చంద్రబాబునాయుడే మళ్లీ కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిం చి అఽధికారం చేపట్టడం ఖాయమన్నారు.

టీడీపీలో పలువురు చేరిక..

వాల్మీకిపురం మండలం పాతకోటపల్లెకు చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. శనివారం గ్రామానికి చెందిన రాజేష్‌కుమార్‌రెడ్డి, సిద్దారెడ్డి, చింతల భార్గవి, శంకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, శ్రీరాములు, రమణ, గణేష్‌కుమార్‌రెడ్డి, రామచంద్ర, శ్రీనివాసులురెడ్డి, ఆదినారాయణ మరో పది కుటుంబాలు టీడీపీలో చేరగా నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ కార్యక్ర మంలో పీలేరు టీడీపీ, యువత అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహీధర్‌రెడ్డి, లంకిపల్లె మధు, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, సర్పంచ మహిత శేషాద్రిరెడ్డి, పీలేరు టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడులంకిపల్లె మధు, జనసేన మండల అధ్యక్షుడు కిశోర్‌, నాయకులు, యువత, మహిళలు పాల్గొన్నారు.

కిశోర్‌ను గెలిపించి.. అభివృద్ధికి సహకరించాలి

కలికిరి, మార్చి 16: ఎన్నికల్లో టీడీపీ పీలేరు నియోజక అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి కోరారు. శనివారం కలికిరి పంచాయ తీలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇం టింటి ప్రచారం నిర్వహించారు. శని వారం పంచాయతీలోని యల్లమ్మగు డి వీధి, నల్లారివాండ్లపల్లె, కాలేజీ రోడ్డు, పొట్టేకులవారిపల్లె, రెడ్డివారిప ల్లె, ఇందిరా నగర్‌, శీనయ్య కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ఈ పర్యటనలో కలికిరి సర్పంచు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, ఎం పీటీసీ గాయత్రి, నిజాముద్దీన, సునీల్‌ కుమార్‌ రెడ్డి, లాయర్‌ యల్లా రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, చంద్రా రెడ్డి, రాజా రెడ్డి, శ్రీమన్నారాయణ రెడ్డి, సహదేవ రెడ్డి, ఆర్టీసీ రెడ్డెప్ప రెడ్డి, కేవీ రెడ్డి, విజయకుమార్‌ రెడ్డి, రమేష్‌ చెట్టి, రాజన్న, అఫ్రోజ్‌ బాషా, వర్మ, ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయం ప్రారంభం

గుర్రంకొండ, మార్చి 16: మండలంలోని మర్రిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సైనికుల్లాగా పని చేయాలన్నారు. అలాగే మర్రిమాకులపల్లె మాజీ సర్పంచ రెడ్డెప్పరెడ్డి తల్లి నాగలక్ష్మీ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆమె భౌతికకాయానికి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్‌, జయసూరి, దిలీప్‌, బయ్యారెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:07 PM