Share News

క్రీడలతో ఆత్మవిశ్వాసం

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:00 PM

క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, ఆరోగ్యాన్ని సమకూరుస్తాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో ఆత్మవిశ్వాసం
క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన, ఆగస్టు 24: క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, ఆరోగ్యాన్ని సమకూరుస్తాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ 89వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన అండర్‌-17 క్రీడా పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారు లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో పాల్గొని రాష్ర్టానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వయ్య మాట్లాడుతూ పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించాలంటే క్రీడలు చాలా ముఖ్యమని, క్రీడాకారులు రాబోవు రోజుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో రాణించి భారతదేశానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త కోడి శ్రీనివాసుల రెడ్డి, ప్రైవేటు కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు మదనమోహనరెడ్డి, చైతన్య విద్యాసంస్థల ఏజీఎం రమణ, మానవత సంస్థ చైర్మన శివగంగిరెడ్డి, సుండుపల్లె మండల టీడీపీ నాయకులు శివారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యులు బుక్కే విశ్వనాఽథనాయక్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు నరసరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కోటేశ్వర రావు, నియోజకవర్గ నాయకులు రఘుపతి, సతీశనాయక్‌, శ్రీధర్‌ నాయక్‌, నాగార్జున, మణి తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం..

పట్టణంలోని కొత్తపేట శివరామాలయంలో మంత్రి మండిపల్లి పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని గరగుపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ పల్లపువాసు, మాజీ సర్పంచ బసయ్యల ఆధ్వర్యంలో గరుగుపల్లి గ్రామస్తులు మంత్రి మండిపల్లికి బ్యాండు మేళాలు, బాణసంచాతో ఘనంగా స్వాగతం పలికారు.

చౌడేశ్వరి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు

చిన్నమండెం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలోని చౌడేశ్వరి ఆలయంలో సతీమణి హరితరెడ్డి, కుమారుడు నిశ్చల్‌నాగిరెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి కుటుంబానికి స్వాగతం పలికి , పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

రామాపురం: మం డలంలోని చిట్లూరు హరిజన వాడలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మంత్రితోపాటు మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాఽథరెడ్డి పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్లూరు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. పోశాల వెంకట్రమణ, గాలివీటి మల్‌రెడ్డి కుమారుడు లోకేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మురళీ కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

నేడు గాలివీడులో మంత్రి పర్యటన

గాలివీడు: నేడు గాలివీడులో రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్యారంపల్లె గీదరవాండ్లపల్లెలో టీడీపీ నాయకులు గీదర ఈశ్వర్‌రెడ్డి కుమారులు గీదర ధర్మారెడ్డి, నాగభూషణ్‌రెడ్డి (ఎనఆర్‌ఐ) ఇస్తున్న విందులో ఆయన పాల్గొననున్నారు. కార్యక్రమానికి ఆయన సోదరుడు లక్ష్మిప్రసాద్‌రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు హాజరుకానున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:01 PM