త్వరలో సహకార సంఘాల కంప్యూటరైజేషన
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:32 PM
అన్నమయ్య జిల్లాలోని 41సహకార సంఘాలను కంప్యూటరైజ్ చేయను న్నట్లు అన్నమయ్య జిల్లా కో-ఆపరేటివ్ అధికారి గురుప్రకాష్ తెలిపారు.
నిమ్మనపల్లి, ఆగస్టు 21: అన్నమయ్య జిల్లాలోని 41సహకార సంఘాలను కంప్యూటరైజ్ చేయను న్నట్లు అన్నమయ్య జిల్లా కో-ఆపరేటివ్ అధికారి గురుప్రకాష్ తెలిపారు. బుధవారం మండలం లోని సహకార సంఘాన్ని పరిశీంలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని నిమ్మనపల్లి, తిమ్మ సముద్రం మండలాలను ఎంపిక చేశామన్నారు. మిగిలిన 39 సహకార సంఘాలను కూడా అక్టోబరు-2లోగా పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో దేఽశంలో ఎక్కడి నుంచైనా సహకార సంఘాలలో వారి ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుకోవచ్చన్నారు. జన ఔషధి కేంద్రాలలో తక్కువ ధరకే మందులు విక్రయిస్తున్నామని, దీంతో పాటుగా సీఈసీ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి తక్కువ ధరలకే అన్ని సేవలు అందిస్తునట్లు తెలిపారు. ప్రస్తుతం నిమ్మనపల్లితో పాటు తిమ్మసముద్రం సహకార సంఘాలు కంప్యూటరైజ్ అయ్యాయని అనుమతులు వచ్చిన వెంటనే వీటిని ప్రారంభి స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సన ఇనచార్జి రఘునాఽథరెడ్డి, ఎస్‌ఐ మొహిద్దీన, డీఆర్‌వో ప్రవీణ్ ప్రకాష్, సిబ్బంది వేణుగోపాల్, ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.