ఫ్రీహోల్డ్ భూములపై సమగ్ర విచారణ
ABN , Publish Date - Aug 17 , 2024 | 12:01 AM
గత ప్రభుత్వహయాంలో ఫ్రీహోల్డ్ ఇచ్చిన డీకెటీ, అసైన్డ భూములన్నింటిపై సమగ్రంగా, కూలంకషంగా రీవెరిఫికేషన చేయిస్తున్నామని మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.
అర్హులైన రైతులెవ్వరికీ అన్యాయం జరగనివ్వం మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి
బి.కొత్తకోట, ఆగస్టు16: గత ప్రభుత్వహయాంలో ఫ్రీహోల్డ్ ఇచ్చిన డీకెటీ, అసైన్డ భూములన్నింటిపై సమగ్రంగా, కూలంకషంగా రీవెరిఫికేషన చేయిస్తున్నామని మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. దీనివల్ల అర్హులైన రైతులెవ్వరికీ అన్యాయం జరగదని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన బి.కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో ఫ్రీహోల్డ్ రీవెరిఫికేషన, కులం సర్టిఫికెట్ దరఖాస్తులను పెద్దసంఖ్యలో ఆనలైనలో రిజెక్ట్ చేయడంపై సమీక్ష నిర్వహించారు. వీఆర్వోలను ఒక్కొక్కరుగా పిలిచి ఆయా గ్రామ ఫ్రీహోల్డ్ భూముల వివరాలు, రీవెరిఫికేషన స్టేటస్, కులం సర్టిఫికెట్ల తిరస్కరణపై ఆరా తీశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మదనపల్లె రెవెన్యూ డివిజనలో 42వేల ఎకరాలకు పైగా ఫ్రీహోల్డ్ ఇచ్చారని, వాటిపై రీవెరిఫికేషన 45శాతం పూర్తయిందన్నారు. ఇప్పటిదాకా 22వేల పైచిలుకు ఎకరాలను పరిశీలించగా 8వేల ఎకరాల ను వివిధ కారణాల వల్ల ఫ్రీహోల్డ్‌ను రద్దు పరచడం జరిగిందన్నారు. 2003 తర్వాత పట్టాలు పొంది, భూములను అన్యాక్రాంతం చేసివున్నా, అక్రమంగా రికార్డులు సృష్టించి రిజిసే్ట్రషనలు చేసిఉన్నా అటువంటి భూములకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రీహోల్డ్ ఆయి న భూములకు సంబంధించి రైతుల వద్ద పాతపట్టాలు లేకపోయినా తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న 10వన, ఏ రిజిస్టర్ మేరకు వారి అర్హత ను గుర్తించి న్యాయం చేయాలని మండల రెవెన్యూ సిబ్బందిని ఆదేశి స్తామన్నారు. ఫ్రీహోల్డ్ అయిన భూములలో సుమారు 1500 ఎకరాలు మాత్రమే రిజిసే్ట్రషన్లు జరిగాయని అవసరమైతే వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనంతో హార్స్‌లీహిల్స్ భూములకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, అన్ని మండలా లలో జరుగుతున్న ఫైళ్ల రికవరీ లాగానే హిల్స్ రికార్డులు సిద్ధం అవుతాయని స్పష్టం చేశారు. తానే ఛైర్మన అయిన హార్స్‌లీహిల్స్ టౌన షిప్ కమిటీ సమావేశాలు త్వరలో నిర్వహించి హిల్స్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో తహశీల్దార్ శ్రీధర్‌రావు, డీటీ మహ్మద్ అన్సారీ, ఆర్‌ఐ బాలాజీ, వీఆర్వోలు పాల్గొన్నారు.