Share News

పోటాపోటీగా క్రికెట్‌ టోర్నమెంట్లు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:05 PM

సంక్రాంతి పురస్కరించుకొని మండల పరిధిలోని రాచపల్లెలో గంటా నరహరి ఆధ్వర్యంలో పది రోజులుగా నిర్వహించిన క్రికెట్‌ పోటీలు ఆదివారం ముగిసాయి.

పోటాపోటీగా క్రికెట్‌ టోర్నమెంట్లు
క్రికెట్‌ పోటీలను తిలకిస్తున్న గంటా నరహరి

ఒంటిమిట్ట, జనవరి14 : సంక్రాంతి పురస్కరించుకొని మండల పరిధిలోని రాచపల్లెలో గంటా నరహరి ఆధ్వర్యంలో పది రోజులుగా నిర్వహించిన క్రికెట్‌ పోటీలు ఆదివారం ముగిసాయి. ఈసందర్భంగా రాజంపేట టీడీపీ నాయకులు గంటా నరహరి ఫైనల్‌ మ్యాచ తిలకించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. గ్రామీణ విద్యార్థులు యువతను ఉత్సాహ పరిచేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతగా నిలిచిన ఒంటిమిట్ట ఫ్రెండ్స్‌ జట్టుకు రూ. 40వేలు,రన్నర్స్‌గా నిలిచిన గొల్లపల్లె జట్టుకు రూ. 30 వేలు, మూడో స్థానంలో నిలిచినఒంటిమిట్ట కరెంటు టీంకు పది వేల రూపాయల నగదును గంటా నరహరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారాు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత విద్యార్థులు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, రాజంపేట మండల అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య, పార్లమెంటు కార్యదర్శి నాగమునిరెడ్డి, పసుపులేటి రమణ, క్రీడాకారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నందలూరు: క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందని రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. ఆదివారం నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రబ్బర్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ పోటీలలో విన్నర్స్‌కు రూ. 15 వేలు, రన్నర్స్‌కు రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ సమ్మెట శివప్రసాద్‌, నాయకులు ఆకుల చలపతి, కమిటీ సభ్యులు మణి, కాశీ, వెంకటేష్‌, ఎం.సుబ్రమణ్యం, లక్ష్మీనారాయణ, శివ, భార్గవ్‌, సుబ్రమ ణ్యం, షంషీర్‌, వై.సుబ్రమణ్యం, సుబ్బు, అస్లాం, తల్మా, నవీన, శివ, సాయి పాల్గొన్నారు.

నందలూరు: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని చుక్కా వెంకటయ్య ముదిరాజ్‌, వెంకటేశ్వరయ్య, యా నాది ముదిరాజ్‌ తెలిపారు. మండలంలోని మదన మోహనాపురం గ్రామ పంచాయతీ, చింతకాయల పల్లె గ్రౌండ్‌లో ఆదివారం వారు క్రికెట్‌ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో గెలిచిన వారికి రూ. 50 వేలు, రన్నర్స్‌కు రూ. 30 వేలు అందించనున్నట్లు తెలిపారు. ప్రారంభ మ్యాచలో చుక్కాయపల్లె జట్టుపై చింతకాయలపల్లె జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం నల్లతిమ్మయ్యగారి పల్లె, మిద్దెల మధ్య జరిగిన పోటీలో మిద్దెల టీం విజయ దుందుభి మోగించింది. ఈ పోటీలకు ఆర్గనైజర్లుగా చుక్కా రమణయ్య, చింతకాయల ఉపేంద్ర, కడప చిన్ని కృష్ణ, బోయిన హరిబాబు, చింతకాయల వెంకటేష్‌, చింతకాయపల్లె యూత పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:05 PM