ప్రతిష్టాత్మకంగా పీలేరులో రా.. కదలి రా.. సభ
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:49 PM
పీలేరులో జరుగనున్న రా.. కదలి రా.. బహిరంగ సభను ప్రతిష్టా త్మకంగా తీసుకుని విజయవంతం చేసేందు కు టీడీపీ శ్రేణులు కదలిరావాలని పీలేరు ఇనచార్జీ నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి కోరారు.

కలికిరి, జనవరి 12: పీలేరులో జరుగనున్న రా.. కదలి రా.. బహిరంగ సభను ప్రతిష్టా త్మకంగా తీసుకుని విజయవంతం చేసేందు కు టీడీపీ శ్రేణులు కదలిరావాలని పీలేరు ఇనచార్జీ నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం నగరిపల్లెలో జరిగిన కలికిరి మండల టీడీపీ విస్తృత సమావేశంలో ఈ నెల 24న నిర్వహించనున్న రా..కదలిరా.. సభపై టీడీపీ నాయకులతో ఆయన చర్చించారు. పీలేరు పరిసర సమీప మండలాల్లో కలికిరి కూడా ఒకటని, ఇక్కడి నుంచి మోటారు సైకిళ్ళు, ఆటోలు, కార్లను పూర్తి స్థాయిలో సమీకరించుకోవాలని చెప్పారు. ఉదయం 9 గంటలకు కలికిరి నుంచి సభకు బయలు దేరాలని చెప్పారు. సమావేశం అనంతరం పంచాయతీల వారీగా విడివిడిగా సమావేశమై లక్ష్యాలను నిర్దేశించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్, కలికిరి సర్పంచు ప్రతాప్‌కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు నిజాముద్దీన, సతీష్ రెడ్డి, మర్రికుంటపల్లె, పత్తేగడ, గుండ్లూరు, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె సర్పంచులు రెడ్డిరాము, యల్యయ్య, సైఫుల్లా, జాహీదా, ఎంపీటీసీలు కృష్ణయ్య, చిన్నరెడ్డెయ్యతోపాటు అన్ని అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.