Share News

టీడీపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఘర్షణ

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:24 PM

టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించడంతో సోమవారం తంబ ళ్లపల్లె మండల కేంద్రంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది.

టీడీపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఘర్షణ
టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న సీఐ మధు, ఎస్‌ఐ శివకుమార్‌

తంబళ్లపల్లె, జూలై 8: టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించడంతో సోమవారం తంబ ళ్లపల్లె మండల కేంద్రంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది. తంబళ్లపల్లె మండల కేంద్రంలో వైఎస్సార్‌ కూడలిలో సోమవారం వైసీపీ నాయకులు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆ చుట్టు పక్కల వైసీపీ జెండాలు కట్టారు. ఈ క్రమంలో వైసీపీ జెండా ఆవిష్కరించాలనే కారణంతో జెండా స్తంభం పక్కనే ఇటీ వల స్థానిక టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించారు. విషయం తెలు సుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని తమ బ్యానర్‌ ఎలా తొలగిస్తారని వైసీపీ నాయకులతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావ రణం చోటుచేసుకుంది. విషయం తెలుసుక్ను ఎస్‌ఐ శివకుమార్‌ అక్కడికి చేరుకోగా తమ బ్యానర్‌ను వైసీపీ వారు కావాలనే తీసి వేశారని, తిరిగి మళ్లీ వారే కట్టాలంటూ టీడీపీ నాయకులు పట్టు బట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన గా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ఎస్‌ఐ వైసీపీ నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. కాగా ములకలచెరువు సీఐ మధు అక్కడికిరాగా టీడీపీ ఫ్లెక్సీని తొలగించిన వైసీపీ నా యకు లు అదే స్థానంలో తిరిగి ఫ్లెక్సీని ఏర్పాటు చేయించేలా చూడాల ని కోరారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండ లాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్టేషనకు వెళ్లి టీడీపీ ఫ్లెక్సీని తొలగించిన వైసీపీ నాయకులపై కఠినచర్యలు తీసుకోవా లని తంబళ్లపల్లె ఎస్‌ఐ శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 08 , 2024 | 11:24 PM