Share News

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గెలుపుపై సంబరాలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:40 PM

పీలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి భారీ విజ యాన్ని చేజిక్కించుకోవడంతో మండలంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతు న్నారు.

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గెలుపుపై సంబరాలు
తనూజా రెడ్డి కుటుంబీకులతో కలిసి విజయకేతనాలు తెలుపుతున్న మహిళలు

్జకలికిరి, జూన 4:పీలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి భారీ విజ యాన్ని చేజిక్కించుకోవడంతో మండలంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతు న్నారు. రాయచోటి కౌంటింగ్‌ కేంద్రం నుంచి స్వస్థలం కలికిరి చేరుకోవలసి వుండగా దారి పొడవున్నా భారీగా పార్టీ శ్రేణలు స్వాగతం పలికారు. పదేళ్ళ తరువాత ఎన్నికల్లో కిశోర్‌ కుమార్‌ రెడ్డి విజయం సాధించడంతో మండలంలోని అన్ని గ్రామాల్లోనూ బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చి న వారితో గ్రామం కిటకిటలాడింది. పీలేరు, కేవీ పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా నగరిపల్లె చేరుకుని సంబరాల్లో పాలుపంచుకు న్నారు. కిశోర్‌కుమార్‌ రెడ్డి సతీమణి తనూజా రెడ్డి, కుమార్తె డాక్టర్‌ వైష్ణవి, కోడలు డాక్టర్‌ షమా రెడ్డిలతో కలిసి విజయ సంకేతాలు తెలుపుతూ పరస్పరం అభినందించుకున్నారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి గెలుపుపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే బాణాసంచా కాల్చుతూ జరుపుకున్న సంబరాలు అం బరాన్నంటాయి. మండలంలోని గండబోయనపల్లె, చింతపర్తి, మంచూరు, తదితర గ్రామా ల్లో సైతం కూటమినాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈకార్యక్రమాలలో నాయకులు రాజేంద్రాచారి, కోసూరి చంద్రమౌళి, కువైట్‌ సయ్యద్‌బాషా, బొక్కసం బ్రదర్స్‌, టమోటా రామచంద్ర, పులి సత్యారెడ్డి, శేషాద్రి రెడ్డి, సర్పంచ మహిత, చాను, సాదిక్‌,ఫణి, విజయ్‌, ఖాదర్‌వల్లి, సైదు, జావీద్‌, తుంబూరి రమణ, సుధాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, మహ్మద్‌హుస్సేన, మెకానిక్‌ చాను, అమీర్‌జాన, గాంధీ పేట రెడ్డి, రామాంజులురెడ్డి, ఎస్‌ఎండీ యూసుఫ్‌, కూరగాయల జాఫర్‌, జంషీద్‌, షబ్బీర్‌ ఆలీఖాన, జావీద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కిరణ్‌కుమార్‌ రెడ్డి శిబిరంలో నిరాశ

కాగా రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసిన కిశోర్‌కుమార్‌ రెడ్డి సోదరుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఓడిపోవడం ఆ పార్ఠీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఎలాంటి సందడి లేకుండా ఓటమికి గల కారణాలను వెలికితీయడంలో ఆయన వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 11:41 PM