Share News

భోగి మంటల్లో ఎస్మా ప్రతుల దహనం

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:59 PM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంతో పాటు అంగన్వాడీ లపై ప్రయోగిస్తామంటున్న ఎస్మా ప్రతులను ఆదివారం ప్రజా సంఘాల నేతలు అంగన్వాడీ వర్కర్లు, రాయచోటి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి సమీపంలోని అంబేద్కర్‌ ఫ్లెక్సీ వద్ద భోగిమంటల్లో వేసి దహనం చేశారు.

భోగి మంటల్లో ఎస్మా ప్రతుల దహనం
రాయచోటి: జీవో ప్రతులను దహనం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు, అంగన్వాడీ వర్కర్లు

రాయచోటిటౌన, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంతో పాటు అంగన్వాడీ లపై ప్రయోగిస్తామంటున్న ఎస్మా ప్రతులను ఆదివారం ప్రజా సంఘాల నేతలు అంగన్వాడీ వర్కర్లు, రాయచోటి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి సమీపంలోని అంబేద్కర్‌ ఫ్లెక్సీ వద్ద భోగిమంటల్లో వేసి దహనం చేశారు. జగన ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలను, జీవోలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, జగన ప్రభుత్వం ఏ జీవో తీసుకొచ్చినా రాజ్యాంగ విరుద్ధమైనదిగానే ఉన్నదని, ఇలాంటి వారు ప్రజాస్వామ్య దేశానికి పాలకులుగా పనికిరారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీ. ఈశ్వర్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు విశ్వనాఽథనాయక్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు రామాంజనేయులు, రైతు సంఘం అన్న మయ్య జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, పౌర హక్కుల సంఘం న్యాయవాది రెడ్డెయ్య, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోషియేషన జిల్లా కన్వీనర్‌ నాగేశ్వరి, సుజాత, భారతి, సంధ్య, తులసి, రజక సంఘం నాయకులు శ్రీనివాసులు, రమేశ, బంజారా సంఘం నాయకులు శంకర్‌నాయక్‌, జనసేన నాయకులు రామశ్రీనివాసులు, పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: రోడ్లపైనే అంగన్వాడీల నిరసనలు కొనసాగాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ కూడా సమ్మె నిర్వహించే స్థలంలోనే జరుపుకున్నారు. రైల్వేకోడూరు అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో ఎస్మా జీవో-2 ప్రతులను కాల్చి వేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఉద్యమాలు ఆపే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమం లో రైల్వేకోడూరు అంగన్వాడీ సంఘం నాయకురాళ్లు శిరీషా, లీలా, పద్మ, దుర్గా ఐదు మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు.

లక్కిరెడ్డిపల్లె: ప్రభుత్వం విధుల్లో చేరాలని ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో కాల్చివేశారు. ప్రాజెక్టు అధ్యక్షుడు సుకుమార్‌, ప్రధాన కార్యదర్శి ప్రభావతి సెక్టారు లీడర్లు లక్ష్మిదేవి, నాగమణి, శిరీష, ఎరుగమ్మ, శ్రీవాణి, రుక్మిణి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

రాజంపేట: తెలుగు ప్రజల పెద్ద పండుగ భోగి పండుగ రోజు అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని 34వ రోజు నిరసన దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్మా కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. జీవో నెంబరు రెండును రద్దు చేయాలని ు నినాదాలు చేశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, విజయలక్ష్మీ, అమరావతి, శివరంజిని, జోత్స్న, గౌసియా, మమత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 10:59 PM