Share News

ప్రతి ఎకరాకు బ్రహ్మంసాగర్‌ నీరు

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:50 PM

బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌తో కలసి బ్రహ్మంగారిమఠానికి విచ్చే శారు.

ప్రతి ఎకరాకు బ్రహ్మంసాగర్‌ నీరు
బ్రహ్మంసాగర్‌ నుంచి కాల్వలకు నీటిని వదులుతున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌

పుట్టా సుధాకర్‌ యాదవ్‌

కుడిఎడమ కాల్వలకు నీటి విడుదల

బ్రహ్మంగారి సన్నిధిలో ఎంపీ, ఎమ్మెల్యే

బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 17: బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌తో కలసి బ్రహ్మంగారిమఠానికి విచ్చే శారు. వీరికి బ్రహ్మంగారిమఠం ఐదురోడ్ల కూడలి వద్ద చెన్నుపల్లి సుబ్బారెడ్డి, కానాల మల్లికార్జునరెడ్డి గజమాలతో సన్మానించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకరబాలాజీ ఆహ్వానం కలిపి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఎడమ కాల్వకు 400 క్యూసెక్కులు, కుడికాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి రైతుకు నీటిని అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్న లక్షా 50 వేల ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. పూర్తిస్థాయిలో చెరువులను నింపుతామన్నారు. బ్రహ్మం సాగర్‌ ప్రాజెక్టు కింద ఉన్న చిన్న చిన్న పిల్లకాల్వలకు మరమ్మత్తు పనులు చేయిస్తా మన్నారు. అర్హులైన పేదలం దరికీ సంక్షేమ, ప్రభుత్వ పథ కాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. మైదుకూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా, వీర బ్రహ్మేంద్రస్వామి దేవ స్థానాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రితీశ్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌ శ్రీనివాసులరెడ్డి, ముడుమాల పోలిరెడ్డి, ఎల్ల టూరు సాంబశివారెడ్డి, ఎల్ల టూరు ఈశ్వర్‌రెడ్డి, రాగి మాను ప్రతాప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:50 PM