Share News

టీడీపీ,బీజేపీ,జనసేన కూటమికి బ్రహ్మరథం

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:20 PM

ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మం డలం బొప్పూడి వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహిం చిన బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని మదనపల్లె టీడీపీ అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా తెలిపారు.

టీడీపీ,బీజేపీ,జనసేన కూటమికి బ్రహ్మరథం
మాట్లాడుతున్న షాజహాన్‌ బాషా

టీడీపీ అభ్యర్థి షాజహాన్‌బాషా

మదనపల్లె టౌన్‌, మార్చి 18: ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మం డలం బొప్పూడి వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహిం చిన బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని మదనపల్లె టీడీపీ అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా తెలిపారు. సోమవారం స్థానిక సుభాష్‌ రోడ్డులో షాజహాన్‌బాషా నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాలుగేళ్ల 10 నెలల అరాచక పాలనలో లక్షలాదిమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, టీడీపీ నాయకులు బాధితులయ్యారన్నారు. రాష్ట్ర మం త్రులు అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తారని, వైసీపీ ఎమ్యెల్యే లు కొంత మంది వందల ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. వైసీపీ పాలనలో రూ.12లక్షల కోట్లు అప్పులు చేసి 5 కోట్ల ఆంధ్రుల నెత్తిన మోపారన్నారు. మూడు పార్టీల కూటమి చూసి వైసీపీ నాయ కుల్లో వణుకు పుట్టిందన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రజలను లోబరు చుకోవాలని చూస్తున్నారని, వారి పప్పులేవీ ఉడకవన్నారు. కూటమి పార్టీలు 160 సీట్లు సాధించడం ఖాయమన్నారు. అమరావతి రాజఽ దాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మదనపల్లె సమ్మర్‌స్టోరేజి ట్యాంకు నిర్మాణం పూర్తి చేయడానికి రూ.4కోట్లు మంజూరు చేయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హంద్రీనీవా నీటిని పుంగనూరుకు మళ్లించి మదనపల్లె ప్రజలపై వివక్ష చూపారన్నారు. జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ 151 సీట్లు గెలిచి 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పిన జగన్‌ ప్రజాపాలన వదలి 30 ఏళ్లకు సరిపడా ధనం సంపాదించాడన్నారు. పోలవరం, సీపీఎస్‌ రద్దు తదితర హామీలను నెరవేర్చని జగన్‌ను ప్రజలు గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకు లు నాదెళ్ల విద్యాసాగర్‌, ఎస్‌ఏ మస్తాన్‌, నాదెళ్ల శివన్న, సుద్దిళ్ల సుధాకర్‌, ఎం. నాగయ్య, జయరామ్‌, రాజన్న, వేములయ్య, ఎంపీటీసీ దేవేంద్ర, కొయ్యలమండి రాజారెడ్డి, కమలామర్రి కృష్ణ పాల్గొన్నారు.

కలసికట్టుగా పనిచేద్దాం

షాజహాన్‌బాషాను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు అన్నారు. సోమవారం తన నివాసానికి వచ్చిన షాజహాన్‌బాషాను సాదరంగా అహ్వానించారు. యోగేష్‌బాబు, దొరస్వామినాయుడు, ఎస్‌ఏ మస్తాన్‌, తెలుగు యువత నాయకులు నాదెళ్ల అరుణ్‌తేజ, ప్రణయ్‌, బాబ్జాన్‌ మోడెం శివ తదితరులు పాల్గొన్నారు.- మండలంలోని పొన్నేటిపాళెం వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు బెల్లె హారతి, కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బెల్లె ప్రసాద్‌ ఇంటికి షాజహాన్‌ బాషా వెళ్లి తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రముఖ రియల్టర్‌ టీకేఎన్‌ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు.

మదనపల్లె అర్బన్‌: స్థానిక సొసైటీ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులను ఉమ్మడి అభ్యర్థి షాజహాన్‌బాషా మర్యాద పూర్వకంగా కలిసి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఙప్తి చేశారు. కురవంకలోని భువనేశ్వరిదేవి ఆలయాన్ని సందర్శించి, ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేష్‌ను కలిసి ఆశీర్వాదం పొందారు బీజేపీ రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లె ప్రశాంత్‌, పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లె రవికుమార్‌, జేకే వర్మ, వేణుగోపాల్‌, రవీంద్ర టీడీపీ నాయకులు నాదేళ్లవిద్యాసాగర్‌, శివన్న, బాలుస్వామి, నవీన్‌, కమలమరికృష్ణ, ఇసుకునూతనపల్లె జయరామ్‌, బిల్లేరెడ్డిప్రసాద్‌, బ్యాంకు రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:20 PM