Share News

బట్టబయలైన వర్గపోరు

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:42 PM

వైసీపీ నేతల మధ్య వర్గపోరు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సమక్షంలో బట్టబయలైంది. రెండో రోజు పర్యటనలో భాగం గా పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీకి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

బట్టబయలైన వర్గపోరు
పెదినేనికాలువ పర్యటనలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి

ఆకేపాటి సమక్షంలో ఇరువర్గాల మాటల యుద్ధం

ప్రచారం నుంచి వెళ్లిపోయిన నేతలు

సుండుపల్లె, ఏప్రిల్‌13: వైసీపీ నేతల మధ్య వర్గపోరు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సమక్షంలో బట్టబయలైంది. రెండో రోజు పర్యటనలో భాగం గా పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీకి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కొద్ది రోజులుగా రెండు వర్గాలు పార్టీలో ఉన్నట్లు, అంతా ఒక్కటైనట్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఛత్రం సమీపంలోని మామిడి కాయల నుంచి వద్ద మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. మరో గ్రామానికి వెళ్లి పర్యటన చేయాలని ఒక వర్గం నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రోత్సహించగా, ఇదే గ్రామంలో షెడ్యూల్‌ ప్రకారం పర్య టించాలని స్థానికులు, మరో వర్గం నేతలు డిమాండ్‌ చేస్తూ ఆకేపాటి ఎదుట వాగ్వాదా నికి దిగారు. అయితే వాళ్లు చెప్పిందే చేసుకోండి మాకెందుకు ఆ పార్టీ అని ఓ వర్గం నేతలు ఎన్నికల ప్రచారం నుంచి వెళ్లిపోయినట్లు వైసీపీ నేతలే చర్చించుకున్నారు.

ఇరువర్గాల మధ్య దాడి జరిగేలా మాటల యుద్ధం సాగినట్లు ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొట్టుకునేందుకే ప్రచారానికి వచ్చారా అనే అనుమానం పలువురిలో తలెత్తింది. పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ నేతలు చెప్పిన విధంగానే ప్రచారం చేయాలని, లేదంటే అంగీకరించేది లేదని ఆ గ్రామ పంచాయతీ నేతలు, కార్యకర్తలు తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడే ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన లేదు. మరోవైపు వర్గపోరు తీవ్రస్థాయిలో ఉండడంతో ప్రచారం నామమాత్రంగా సాగిందని మండలంలో చర్చనీయాంశమైంది.

Updated Date - Apr 13 , 2024 | 11:42 PM