ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 12 , 2024 | 11:35 PM
సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు.

మదనపల్లె అర్బన, మే12: సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లెలోని జడ్పీ హైస్కూల్ పోలిం గ్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల విధులకు హాజరై న పోలీసులకు శిక్షణ తోపాటు ఐపీఎస్ అధికారుల కు సూచనలు ఇచ్చారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకొన్నట్లు ఆయన తెలిపా రు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ చెప్పారు. ఓటర్లు ప్రశాంతవాతావరణంలో తమ ఓట్లు వినియోగించుకొనే విధంగా పోలీసుల కృషి ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేవారిని, ఆ ప్రాంతాలను పరిశీలనలో ఉంచాలన్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే పరిశీలించి వారి గుర్తింపు కార్డులను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.