భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:46 PM
త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీ క బక్రీద్ పండుగ అని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నా రు.

మదనపల్లె అర్బన, జూన 17: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీ క బక్రీద్ పండుగ అని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నా రు. అల్లాహ్ దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే షాజహానబాషా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వేలాదిగా ముస్లింలు ఈద్గాకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బక్రీద్ పండుగ ను ఉద్ధేశించి జామియా మసీద్ మతగురువు జలాలుద్ధీన బక్రీద్ పవిత్రమైన పండుగని, మతసామరస్యాలకు ప్రతీక అని, త్యాగ నిరతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈద్గాలో టీడీపీ మైనార్టీ నేత ఎస్‌ఏ మస్తాన ప్రత్యేక పార్థనలో పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బసినికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో ఈద్గాలో ముస్లింలకు మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన జింకా వెంకటాచలపతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రహంతుల్లా, అబ్దుల్ రెహ్మాన, చాను, షపీ, బషీర్, గోలీ, కలాం, జావీద్, రఫీ, ఖాలూ, మురాశ, తదిత రులు పాల్గొన్నారు. స్థానిక పట్టణం, మదనపనల్లె మండలంలోని ఈద్గాలో ముస్లింలు బక్రీద్ పండుగను వేడుకగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం పరస్పర శుభాకాంక్షలు తెలిపుకున్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని పేదలకు దానధర్మాలు నిర్వహించారు.
పీలేరులో: మహోన్నత త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను సోమవారం పీలేరులోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. ఈద్గాహ్‌లో పండుగ సామూహిక నమాజ్ కోసం ముస్లింలు స్థానిక పెద్దపీర్ల చావిడి వద్ద నుంచి ఊరేగింపుగా మదనపల్లె మార్గంలోని ఈద్గాహ్‌కు చేరుకున్నారు. అక్కడ ముఫ్తీ అబ్దుల్లా ధార్మిక ఉపన్యాసం చేస్తూ బక్రీద్ పండుగలోని ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొంత మంది నమాజు నుంచి స్థానిక ఖబరస్థానలకు చేరుకుని తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారికి నివాళులర్పించారు. తమ, తమ పూర్వీకుల పేరిట చాలా మంది ఖుర్బానీ ఇచ్చి మాంసాన్ని బంధువులు, పేదలకు పంచి పెట్టారు. పండుగ కోసం సొంతిళ్లకు చేరిన పిల్లలు, బంధువులతో పీలేరులోని అత్యధిక ముస్లింల ఇళ్లు కళకళలాడాయి. చాలా మంది తమ ఇళ్లలో స్నేహితులకు విందులు ఏర్పాటు చేశారు. పీలేరుతోపాటు తలపుల, రేగళ్లు, బోడుమల్లువారిపల్లె, ఆరంవారిపల్లె, శివరామాపురం గ్రామాల్లోనూ పండుగ నమాజును ఈద్గాహ్‌లలో ఆచరించారు. పండు గ సందర్భంగా పీలేరు-మదనపల్లె మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి, ఎస్‌ఐలు నరసింహు డు, రమణ తమ సిబ్బందితో పటిష్ట చర్యలు చేపట్టారు.
ములకలచెరువులో: మండలంలో సోమవారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ములకలచెరువు, బురకాయ లకోట, దేవళచెరువు, చౌడసముద్రం, కదిరినాథునికోట, సోంపల్లె తది తర గ్రామాల్లో ముస్లింలు ఈద్గాల వద్ద సాముహిక పార్ధనలు జరిపా రు. ములకలచెరువులో పెద్ద ఎత్తున ముస్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. అనంతరం ఖుర్బాని ఇచ్చారు.
పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో ముస్లింలు బక్రీద్ పం డుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. త్యాగాలకు ప్రతీకగా జరిగిన ఈ పండుగ సందర్భంగా ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక నమాజ్‌లు చేశారు. పెద్దమండ్యం, కలిచెర్ల, తురకపల్లి, వెలిగల్లు, శివ పురం, సిద్దవరం, పాపేపల్లి, గురివిరెడ్డిగారిపల్లి, గుడిసెవారిపల్లి, ముస లికుంట, బండ్రేవు గ్రామాలలో పండుగ వేడుకలు జరిగాయి. హజరత లు, మత పెద్దలు, సర్పంచ బాష, బాబాబేగ్, నజీర్‌ఆహ్మద్, చాంద్ బాషా, వుస్సేనసాబ్, రెడ్డిగౌస్, షుకూర్, పీరానసాబ్ పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: పీటీఎం మండలంలోని పలు గ్రామాల్లో బక్రీ ద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పీటీఎం, రంగసముద్రం, విసనకర్రవాండ్లపల్లె, పులికల్లు కందుకూరు, చెన్నరాయునిపల్లె, మల్లెల, మద్దయ్యగారిపల్లె గ్రామాల్లో ముస్లింలు ఉదయం నుంచి ఆయా గ్రామాల్లో ఉన్న ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రామసముద్రంలో: రామసముద్రం మండల కేంద్రం, తిరుమలరెడ్డిప ల్లె, గొల్లపల్లె, చెంబకూరులోని ముస్లింలు బక్రీద్ వేడుకలను సోమవా రం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దిగువపేట మసీద్ నుంచి బజారువీధి గుండా శ్రీనివాసపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువు ఉసామ్, ముత్వల్లి సిరాజ్ బాషా మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎస్‌ఐ చంద్రశేఖర్ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రార్థన కార్యక్రమంలో మత పెద్దలు, మైనార్టీలు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజాము నుంచి అన్ని మసీదులలో ప్రార్థనలు జరిగాయి. అనంతరం మండలంవలోని పట్టణంలోని ముస్లింలు ప్రదర్శనగా బయలుదేరి స్థానిక నమాజ్‌కట్టవీధి, బైపాస్ రోడ్డులోని ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరుపేదలకు దానధర్మాదిలు చేశారు. స్థానిక దర్గాలో పెద్దల సమాదుల చెంత ఽ ప్రార్థనలు చేశారు. మండలంలోని చింతపర్తి, గండబోయనపల్లె, టేకలకోన, మంచూరు, మాధవరంపల్లె, తదితర ప్రాంతాలలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఖుర్భాని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమాలలో మత పెద్దలు, పీలేరు టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా ముస్లింలు పాల్గొన్నారు.
గుర్రంకొండలో:బక్రీద్ పండును ముస్లీంలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉదయాన్నే ఈద్గాల వద్దకు చేరు కుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువులు చెప్పిన సందేహాన్ని ఆలకించారు. అనంతరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
కలకడలో:బక్రీద్ పండుగను ముస్లీంలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని కలకడ, ఎర్రయ్యగా రిపల్లె, పాపిరెడ్డిగారిపల్లె, ఎర్రకోటపల్లె, కోన, బంగారువాండ్లపల్లె గ్రామాల్లో ఈద్గాలో ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తంబళ్లపల్లెలో: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను తంబళ్లపల్లె మండల వ్యాప్తంగా ముస్లీంలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. సోమవారం ఉదయమే ఈద్గా, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తంబళ్లపల్లెలో ముస్లీంలు పెద్ద మసీ దు నుంచి సిద్దారెడ్డిగారిపల్లె ఈద్గా వద్దకు ర్యాలీగా వెళ్లి ప్రార్థనలు చేశారు.
కురబలకోటలో: త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుం టున్నామని మతగురువు హజరత ఇస్మాయిల్ పేర్కొన్నారు. గురువా రం మండలంలోని అంగళ్ళు, కురబలకోట, ముదివేడు, సాహెబులవా రిపల్లె, చేనేతనగర్, మొలకవారిపల్లె,నందిరెడ్డిగారిపల్లె తదితర గ్రామా ల్లో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. అనం తరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకు న్నారు. ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నిమ్మనపల్లిలో: మండలంలోని ముష్టూరు, చల్లావారిపల్లి, సైదాపేట, సింగంవారిపల్లి, వెంకోజిగారిపల్లి, పిట్టావాండ్లపల్లి, రాచవేటివారిపల్లి తదితర గ్రామాలలో ముస్లింలు సోమవారం బక్రీద్ పండును ఘనం గా నిర్వహించారు. ఈ సంధర్బంగా మసీదు నుంచి బయలు దేరి అల్ల్గాను స్మరిస్తూ ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకొంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.