Share News

గ్రహణం వదలాలంటే బాబు రావాలి: కస్తూరి

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:18 PM

రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదలాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాఽథనాయుడు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని రాజుకుంట, చింతలచెలికలో మండల అధ్యక్షుడు కె.కె.చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రహణం వదలాలంటే బాబు రావాలి: కస్తూరి
రాజుకుంటలో ప్రచారం నిర్వహిస్తున్న కస్తూరి తదితరులు

చిట్వేలి, ఫిబ్రవరి25 : రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదలాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాఽథనాయుడు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని రాజుకుంట, చింతలచెలికలో మండల అధ్యక్షుడు కె.కె.చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూరి ఇంటింటికి కరపత్రాలను పంచా రు. అనంతరం మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కేకే చౌదరి, పారిశ్రామిక వేత్త విశ్వేశ్వర్‌నాయుడు, పూల రమేష్‌, రాజశేఖర్‌, లాయర్‌ బాలాజీ, మహిళ నేతలు అనిత దీప్తి, రేవతి, బాలకృష్ణ, గుండయ్య, శ్రీధర్‌, అనంతయ్య యాదవ్‌, జనసేన నాయకులు మాదాసు నరసింహ, వెంకటేష్‌రాజు, సుబ్రమణ్యం యాదవ్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పెనగలూరు: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ విజయానికి మండల స్థాయి నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు కూడా కృషి చేయాలని నియోజకవర్గ దళిత నాయకురాలు నగిరిపాటి రేవతి కోరారు. ఆదివారం మండలంలోని కాకర్లవారిపల్లె, వడ్డిపల్లె, వెంకటనారాయనపల్లె, ముద్రపల్లెల్లో విస్తృతంగా పర్యటిం చారు. ఈ సందర్భంగా నాయకులతో ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేన సంయు క్తంగా తయారు చేసిన మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ గురించి ప్రతి కుటుంబంలో తెలిసే విధంగా కరపత్రాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కాకర్ల జయరామయ్యనాయుడు, కాకర్లవారి పల్లె సర్పంచ్‌ కె.శివయ్యనాయుడు, మండల నాయకులు కృష్ణయ్యనాయుడు, శివ, ఎస్సీ ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తేనేపల్లి చిన్న, మాజీ తహసీల్దారు సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:18 PM