Share News

బి.కొత్తకోటలో భారీ ఇసుక డంప్‌ సీజ్‌

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:18 PM

బి.కొత్తకోట పట్టణశివారులో భారీ ఇసుక డంప్‌ను సోమవారం అధికారులు సీజ్‌ చేశారు.

బి.కొత్తకోటలో భారీ ఇసుక డంప్‌ సీజ్‌
బి.కొత్తకోట వద్ద ఇసుకను సీజ్‌ చేస్తున్న అధికారులు

బి.కొత్తకోట, జూలై15: బి.కొత్తకోట పట్టణశివారులో భారీ ఇసుక డంప్‌ను సోమవారం అధికారులు సీజ్‌ చేశారు. పట్టణ శివారులో బీరంగి పం చాయతీ పరిధిలోని సర్వేనంబరు 168లో ఇసుక అక్రమంగా నిల్వవుంచి నట్టు సమాచారం రావడంతో రెవెన్యూ, పోలీస్‌, ఎస్‌ఈబీ అధికారులు తమ సిబ్బందితో కలిసి సంబంధిత స్థలానికి వెళ్లి పరిశీలించారు. సదరు ఇసుక పీయల్‌ఆర్‌ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. వైసీపీ అధికా రంలో ఉండగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఇసుకక్వారీల నుంచి టిప్పర్లతో ఇసుకను తరలించారు. నిరంతరంగా సాగిన ఈ ప్రక్రియలో పలుప్రాంతాలలో ఇసుకను నిల్వవుంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బీరంగి పంచాయతీ వర్రోళ్లపల్లె వద్దనున్న ఓ క్వారీ సమీపంలో 3472 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను డంప్‌ చేసి ఉండడంతో సీజ్‌చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పుణ్యవతి, ఏఎస్‌ఐ బొజ్జేనాయక్‌, సర్వేయర్‌ శ్రీవాణి, మైన్స అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:18 PM