Share News

ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:10 AM

నూతనంగా ఓటు హక్కు పొందిన యువ తకు ఓటు వినియోగంపై అవ గాహన కల్పిస్తున్నట్లు తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌ నాయ కులు పేర్కొన్నారు.

ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన

పీలేరు, మార్చి 5: నూతనంగా ఓటు హక్కు పొందిన యువ తకు ఓటు వినియోగంపై అవ గాహన కల్పిస్తున్నట్లు తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌ నాయ కులు పేర్కొన్నారు. వారు రూ పొందించిన ‘మై ఓట్‌-మై ఫ్యూ చర్‌’ పోటీల వాల్‌పోస్ట ర్లను మంగళవారం పీలేరులో ఆవిష్క రించారు. పీలేరులోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి అబ్బూరి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కు పొందిన వారు కరప త్రంలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన చేసుకుని రిజిసే్ట్రషన చేసుకోవాలన్నారు. మార్చి 12వ తేదీలోపు ఓటు గురించి మంచి సందేశం ఉన్న రీల్స్‌, కొటేషన్స, పోస్టర్స్‌ తయారు చేసి పంపాలన్నారు. తొలిసారి ఓటు పొందిన వారందరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు ముబారక్‌, ఎన్టీఆర్‌ నఫీస్‌, తెలుగు యువత నేతలు క్రాంతి, మోదిన బాషా, శ్రీనివాసులు, భానుప్రకాశ, హరి, ప్రసాద్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:10 AM