కేబీజీవీలో హెచఐవీపై అవగాహన
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:04 PM
అవగాహనతో హెచఐవీ బారిన పడకుండా రక్షించుకో వచ్చని డీఆర్పీ అల్లావలి, ఎస్‌వో పద్మా వతి అన్నారు.
సంబేపల్లె, ఆగస్టు 24: అవగాహనతో హెచఐవీ బారిన పడకుండా రక్షించుకో వచ్చని డీఆర్పీ అల్లావలి, ఎస్‌వో పద్మా వతి అన్నారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని కస్తూరిభాగాంధీ గురుకుల పాఠశాలలో శనివారం హెచఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. లైంగిక సంపర్కాలు, కలుషితమైన సూదులు, సిరంజీలు, పరీక్షింపబడని రక్తం ద్వారా, హెచఐవీ ఉన్న గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. ఆసుపత్రుల్లో హెచఐవీ పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. హెచఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, ఉచి తంగా ఏఆర్‌టీ మందులు ఇస్తామన్నారు. అన్నమయ్య జిల్లాలో ఆగస్టు 12 నుంచి అక్టోబరు 12 వరకు 200 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు, ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది, లింక్ వర్కర్స్ స్కీమ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.