Share News

ట్రాన్సఫార్మల పంపిణీలో అక్రమాలు నివారించండి

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:20 PM

వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల పంపి ణీలో అక్రమాలు జరుగుతున్నా యంటూ బుధవారం టీడీపీ నా యకులు స్థానిక విద్యుత సబ్‌ స్టేషన వద్ద ధర్నా చేశారు.

ట్రాన్సఫార్మల పంపిణీలో అక్రమాలు నివారించండి
సబ్‌స్టేషన వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు

నిమ్మనపల్లి, జనవరి 17: వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల పంపి ణీలో అక్రమాలు జరుగుతున్నా యంటూ బుధవారం టీడీపీ నా యకులు స్థానిక విద్యుత సబ్‌ స్టేషన వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ రెడె ్డప్పరెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జ్‌ ముని రత్నం, అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ ట్రాన్సఫార్మర్‌ కావాలంటే సంబందిత రైతే మెటీరియల్‌ను తోలుకోవాల్సి వస్తోందన్నారు. లైనమెన ఇష్టా రాజ్యం గా రైతుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 9 గంటలైనా కరెంట్‌ సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. స్తంభం నాటాలంటే రూ.2వేలు, ట్రాన్సఫార్మర్‌ పెట్టాలంటే రూ.10వేలు వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే మెటీరియల్‌ తీసుకెళ్లి మీరే బిగించు కోవాలని చెపుతున్నారన్నారు. దీంతో చేసేదేమీ లేక వారు అడిగినంత డబ్బును చెలి ్లస్తున్నట్లు వివరించారు. లైనమెనతోపాటు బయటి వ్యక్తుల అజమాయిషీ ఎక్కువగా ఉందని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకొని అక్రమాలు అరికట్టాలని ఏఈ వసం తరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవాని ప్రసాద్‌, రాజన్న, మధుబాబు, రెడ్డెప్ప, శ్రీపతి, రమణ, రామకృష్ట, విజయ్‌, సూర్యప్రకాశ, కేశవ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:20 PM