Share News

అట్టహాసంగా జయచంద్రారెడ్డి నామినేషన

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:29 PM

తంబళ్లపల్లె నియోజవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన దాఖలు చేశారు.

అట్టహాసంగా జయచంద్రారెడ్డి నామినేషన
నామినేషన దాఖలు చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి సతీమణి కల్పనరెడ్డి నామినేషన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు

అడుగడుగునా బ్రహ్మరథంఫ జనంతో నిండిపోయిన తంబళ్లపల్లె రహదారులు భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు

ములకలచెరువు, తంబళ్ళపల్లె, ఏప్రిల్‌ 19: తంబళ్లపల్లె నియోజవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన దాఖలు చేశారు. సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెలో జన ప్రభంజనం కన్పించింది. ములకలచెరువు పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా జయచంద్రారెడ్డి ఉదయం నామినేషన దాఖలు చేసేందుకు బయలుదేరారు. దారి పొడుతునా ప్రజలు, కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ములకలచెరువు - తంబళ్లపల్లె రోడ్డు జనం, వాహనాలతో నిండిపోయింది. అడుగడుగునా ప్రజలు జయచంద్రారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నామినేషన దాఖలు చేసేం దుకు జయచంద్రారెడ్డితో పాటు నియోజకవర్గ ప్రచార సమన్వయ కర్త సీడు మల్లికార్జున నాయుడు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సురేం ద్రయాదవ్‌, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పోతుల సాయి నాధ్‌, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి, బీజేపీ నేత గోపాల్‌రెడ్డి తది తరులు వెంట వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాఘవేంద్రకు నామినేషన పత్రాలు అందజేశారు. అలాగే జయచంద్రారెడ్డి సతీమణి కల్పనరెడ్డి కూడా నామినేషన దాఖలు చేశారు.

చెన్నకేశవస్వామి ఆలయంలో జయచంద్రారెడ్డి పూజలు

పెద్దతిప్పసముద్రం ఏప్రిల్‌ 19: పీటీఎం మండలంలోని బూచిప ల్లెలో వెలసిన శ్రీదేవి బూదేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయంలో శుక్రవారం తంబళ్లపల్లె నియోజక వర్గ కూటమి అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డిలు ప్రనత్యేక పూజలు చేశారు. బూచిపల్లె మాజీ సర్పంచ కేశవ, ఉమ్మడి పార్టీల నాయ కులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు.

అట్టహాసంగా షాజహానబాషా నామినేషన

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 19: మదనపల్లె టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎం.షాజహానబాషా టీడీపీ శ్రేణులతో కలసి వెళ్లి అట్టహాసంగా నామినేషన వేశారు. శుక్రవారం తన నివాసం నుంచి ర్యాలీగా బయలు దేరారు. సమయం 2 కావస్తుండటంతో ద్వి చక్రవాహనంపై సబ్‌ కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన దాఖలు చేశారు. టీడీపీ సీనియర్‌ నేత మార్పురి సుధాకర్‌ నాయుడు, విద్యా సాగర్‌, శివప్రసాద్‌, నాదెళ్ల శివన్న, ఎస్‌ఏ మస్తాన, జనసేన నాయకుడు జంగాల శివరామ్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:29 PM