వేంపల్లెలో యువకుడిపై దాడి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:01 PM
స్థానిక పులివెందుల రోడ్డులో పట్టపగలే వైసీపీ కార్యకర్త వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై పలువురు గుర్తుతెలియని యువకు లు మూకుమ్మడిగా దాడి చేశారు.

బాధితుడు సతీష్ రెడ్డి అనుచరుడు
పరామర్శించిన వైసీపీ నేతలు
కేసు నమోదు చేసిన పోలీసులు
వేంపల్లె, జూలై 5: స్థానిక పులివెందుల రోడ్డులో పట్టపగలే వైసీపీ కార్యకర్త వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై పలువురు గుర్తుతెలియని యువకు లు మూకుమ్మడిగా దాడి చేశారు. శాసన మండ లి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ్‌షరెడ్డి ముఖ్య అనుచరుడు అజయ్‌కుమార్‌రెడ్డి బైకులో వస్తుండగా బొలెరో వాహనంతో ఢీకొట్టి హాకీ స్టిక్కులు, క్రికెట్ బ్యాట్, రాళ్లతో తీవ్రంగా దాడి చేశారు. గాయపడిన అజయ్‌కుమార్‌రెడ్డిని వేంపల్లె ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. టీడీపీ నేతలనే తిట్టేవాడివా అంటూ వారు దాడి చేశారు. ఈ ఘటనపై పది మందికి పైగా హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ చాంద్‌బాష తెలిపారు. సీఐ, బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పులివెందుల రోడ్డులోని ఓస్కూల్ నుంచి సాయం త్రం 4 గంటలకు అదే స్కూల్లో పనిచేస్తున్న శేఖర్‌తో కలిసి అజయ్‌కుమార్‌రెడ్డి బైకులో ఇం టికి బయలుదేరాడు.
బైకు రోడ్డు మీదకు రాగానే అప్పటికే వేచి ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంతో ఢీకొట్టారు. పక్కనే కాచుకు న్న యువకులు హాకీస్టిక్కులు, క్రికెట్ బ్యాట్, రా ళ్లతో తీవ్రంగా దాడి చేశారు. వెంట ఉన్న శేఖర్ తప్పించుకుని స్కూల్ వద్దకు పరిగెత్తాడు. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు కేకలు వేసుకుం టూ రావడంతో అజయ్‌కుమార్‌ను వదిలి బొలె రోలో పరారయ్యారు. సుమారు పది మంది దాకా దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయం పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్‌కుమార్‌ను సతీ్‌షరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, వేంపల్లె సర్పంచు ఆర్.శ్రీను తదితరులు పరామర్శించారు. అజయ్ మాట్లాడుతూ టీడీపీకి చెందిన రవితేజారెడ్డి, అజ్జుగట్టు రఘునాథరెడ్డిని మాట్లాడేవాడివా అంటూ విచక్ష ణా రహితంగా దాడి చేశారని విలేకరులకు తెలిపాడు. బాధితుడి సోదరుడు మౌనీధర్‌రెడ్డి వేంపల్లె పోలీ్‌ససులకు చేసిన ఫిర్యాదుపై పది మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులపై హత్యాయత్నం కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.