Share News

యువతకు ఆదర్శం.. స్వామి వివేకానందుడు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:53 PM

యువతకు ఆదర్శం.. స్వామి వివేకానం దుడని వక్తలు పేర్కొన్నారు.

యువతకు ఆదర్శం.. స్వామి వివేకానందుడు
పీలేరులో స్వామి వివేకానందకు నివాళులర్పిస్తున్న వాసవీ క్లబ్‌ సభ్యులు

మదనపల్లె, అర్బన, జనవరి 12: యువతకు ఆదర్శం.. స్వామి వివేకానం దుడని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్థానిక జడ్పీహైస్కూల్‌లోని వివేకానంద విగ్రహానికి మదనపల్లె వాసవీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనాథ్‌, పొన్నుగంటి అమరనాథ్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ ఉపాధ్యక్షుడు వీవీ కృష్ణరావు, కోశాధికారి లక్ష్మీదీపక్‌, వనితక్లబ్‌, వాసవీక్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువజన దినో త్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ గోపతి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వ హించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ తరం యువత స్వా మి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్ర మంలో ఎనసీసీ ప్రొగ్రామ్‌ఆఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి, అధ్యాపకులు ఎంవీ నాయుడు, జ్ఞానశేఖర్‌, వెంకటాచలపతి, లక్ష్మీ, నిర్మలమ్మ, నారాయణ రెడ్డి, పరతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో: స్వామి వివేకానంద జయంతిని శుక్రవారం పీలేరులోని పలు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. స్థానిక కోటపల్లె క్రాస్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసీ ఘనంగా నివాళుల ర్పించాయి. యువజన అవార్డు గ్రహీత రాయల బాబు రాజేంద్రప్రసాద్‌ స్థానిక శ్రీలక్ష్మీ వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బి.చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరి వెంకటరామయ్య, నాయకులు కంభం నరసింహారెడ్డి, సురేంద్రనాథరెడ్డి, డీసీసీ బ్యాంకు ఎంజీఎం యోగేశ్వర రెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు వసంతాల రాజా, మైనారిటీ నాయకుడు మహబూబ్‌ బాషా, వీ211ఏ వాసవీ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ సురేశ బాబు, నాయకులు జయచంద్ర, తులసీకృష్ణ, హరి, భరత, సత్యనారాయణ పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: స్వామి వివేకానంద జయంతి వేడుకలను శుక్రవారం వాల్మీకిపురంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నా రు. స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వివేకానందుడి చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనవి జ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్‌, ఏపీఎం నరసింహులు, సీసీ లు మహేశ్వరి, శంకరయ్య, గంగులప్ప, శ్రీని వాసులు, భూదేవి, దేవ యాని, రజనికుమారి, సంఘమిత్రలు పాల్గొన్నారు.

కురబలకోటలో: యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగా లని మోటివేటర్‌ రామ్మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ డేటా సైన్స విబాగం ఆధ్వ ర్యంలో వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని జాతీయ యువ జన దినోత్సవాన్ని ఎనఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చేతుల్లోనే దేశభవిష్యత ఆధారపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి కుసుమ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రంలో: స్వామి వివేకానంద జయంతి వేడుకలను మండ లంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశ ఔనత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వా మి వివేకానందుడని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. నేటి యువత వివేకానంద అడుగు జాడల్లో నడవాలన్నారు.

బి.కొత్తకోటలో : బి.కొత్తకోటలో స్వామి వివేకానందుని 160 వ జయం తిని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, వాకర్స్‌ ప్రాంగణంలో వేరువేరుగా వివేకానందుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా చేసి న ఘనత వివేకానందునికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ రామచంద్ర, ఎంఈవో రెడ్డిశేఖర్‌, భీమేశ్వరాచారి, వాకర్స్‌ అసోసి యేషన అద్యక్షులు ఎన కృష్ణారెడ్డి, సాంబశివయ్య, ప్రసాద్‌, ప్రభాకర్‌, మహేష్‌, సాబ్జి, పవన, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:53 PM